హాట్ బాంబ్ షెర్లీన్ చోప్రా మరోసారి తన అస్త్రాన్ని సంధించింది. అదేనండీ అందాల విందు కార్యక్రమం. సోషల్ మీడియాతో పరిచయమున్న ప్రతీ ఒక్కరూ ఈ విందుకు ఆహ్వానితులే. పిక్ విషయానికి వస్తే, బ్లాక్ నెట్టెడ్ క్లాత్‌లో ఓ బ్రా ధరించి హాట్ పోజిచ్చింది. తలపై ధరించిన టోపీ ఫోటోకి అఫీషియల్ లుక్ తెచ్చిపెడుతోంది. బ్యాక్ గ్రౌండ్లో జైలు ఊచలు.. బ్యాక్ గ్రౌండ్ కాదనుకోండి. ఫోటో షూట్ కోసం చేసిన స్పెషల్ ఎఫెక్ట్ అది. ఆమె హాట్ హాట్ అందాలతో కుర్రకారును ఆ జైలులో బంధించేయాలనుకుంటోందన్న మాట.
ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ పాప ఏం చేస్తుందో తెలుసా.? అస్సలు ఖాళీగా ఉండదులెండి పాపం. పబ్లిసిటీ కోసం ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఆ క్రమంలో ఇలాంటి హాట్ ఫోటో షూట్సే కాదు, అప్పుడప్పుడూ షార్ట్ ఫిలింస్ వంటివి కూడా చేస్తుంద. తాజాగా స్వీయ దర్శకత్వంలో 'మాయ' అనే షార్ట్ ఫిలిం వెలగబెడుతోంది. మోడలింగ్ రంగంపై పట్టుంది. పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. హిందీ బిగ్‌బాస్ 3 సీజన్లో తన మెరుపులు మెరిపించింది. అబ్బో.. ఒక్కటేంటి.. ఇట్టాంటి కళలు సాలానే ఉన్నాయి అమ్మడిలో.