వావ్‌.! షెర్లీన్‌ గ్లామర్‌ సందేశం విన్నారా!

By iQlikMovies - June 28, 2019 - 08:30 AM IST

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియా సెన్సేషన్‌ హాట్‌ ఐటెం బాంబ్‌ షెర్లీన్‌ చోప్రా ఎప్పుడూ హాట్‌ పిక్స్‌తోనూ, న్యూడ్‌ షోలతోనే కాలక్షేపం చేయకుండా, అప్పుడప్పుడూ కొంచెం ఇన్నోవేటివ్‌గానూ ఆలోచిస్తోందండోయ్‌ ఈ మధ్య. తాజాగా ఆమె ఇన్నోవేటివ్‌ థాట్‌ చూస్తే, ఆహా ఏమి సెప్తివి.. ఏమి సెప్తివి.. అనకుండా ఉండలేం మరి. ఇంతకీ ఈ హాట్‌ బ్యూటీ ఏం సెప్పిందంటారా.? పెద్ద పెద్ద మంచి చెట్లు కొట్టేసి పేపర్‌ తయారు చేస్తున్నారు. అదీ చెత్త కాగితాల్ని.. అంటూ ఓ ఫోటో పోస్ట్‌ చేసి, ఈ సారిలా మెసేజ్‌ ఇచ్చిందన్న మాట.

 

ఫోటోలో అమ్మడు ఎప్పటి మాదిరిగానే హాట్‌గా దాదాపు బికినీలాంటి డ్రస్సులో అందాలారేసింది. ఓ సెక్సువల్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చి విండోలో అందంగా పవళించింది. చేతుల్ని, కాళ్లను కళాత్మకంగా అమర్చి పోజిచ్చింది. ఆమె చుట్టూ కొన్ని పేపర్లు చింపిరి చింపిరిగా ఎగురుతూ కనిపించేలా స్పెషల్‌ ఎఫెక్ట్‌ ఇచ్చింది. అదే ఈ ఫోటోకి అసలు ట్విస్ట్‌ అన్న మాట. అలా గాలికి ఎగిరే చిత్తు పేపర్లను తయారు చేయడం కోసం మంచి చెట్లను నరికేస్తారా.? అనేది షెర్లీన్‌ బేబీ సందేశమే అనుకోండి.. ప్రశ్నిస్తుందనే అనుకోండి.. ఈ సందేశానికి 'అబ్బో షెర్లీన్‌.. నీ నుండి ఇలాంటి సందేశాలు కూడా ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చా ..' అంటూ ఆశ్చర్యంగా కామెంట్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు మన ప్రియమైన నెటిజన్స్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS