అయ్యో.! సాగరకన్య అలా అనేసిందేంటి.!

మరిన్ని వార్తలు

శిల్పాశెట్టిని తెలుగు ప్రేక్షకులు 'సాగరకన్య'గానే గుర్తుంచుకుంటారు. అయితే ఆమె హీరోయిన్‌ మాత్రమే కాదు, యోగా ఎక్స్‌పర్ట్‌ కూడా అన్న సంగతి తెలిసిందే. రకరకాల యోగాసనాలతో వీడియోలు రిలీజ్‌ చేస్తూ, కుర్రకారుకు కెవ్వు కేక పుట్టిస్తుంటుందీ యోగా బ్యూటీ. అరతే కాదండోయ్‌ అప్పుడప్పుడూ కొన్ని కొన్ని రచనలు కూడా చేస్తుంటుంది. అయితే తాజాగా ఆమె రాసిన 'ది డైరీ ఆఫ్‌ ఏ డొమెస్టిక్‌ దివా' పుస్తకాన్ని ఇటీవల విడుదల చేసింది శిల్పాశెట్టి. 

ఈ సందర్భంగా స్టేజ్‌పై ఆమె కొన్ని యోగాసనాలు చేసి వచ్చిన ఆడియన్స్‌ని ఇంప్రెస్‌ చేసే ప్రయత్నం చేసింది. అయితే అలా స్టేజ్‌పై ఆమె వేసిన యోగాసనాలకు ఆ సందర్భంలో ఆమె ధరించిన కాస్ట్యూమ్‌ కంఫర్ట్‌గా లేకపోవడంతో, ఫన్నీగా ఓ కామెంట్‌ చేసింది హాట్‌ హాట్‌ శిల్పాశెట్టి. ఆ కామెంట్‌ కాస్తా ఇప్పుడు వైరల్‌ అయిపోయింది. ఇంతకీ ఆ కామెంట్‌ ఏంటంటే, 'దుస్తులు లేకపోతే యోగాసనాలు ఇంకా బాగా వేసేదాన్ని అని'. అయితే ఆ మాటలోని అర్ధం అప్పటికి వేరే అయినా కానీ, అందులోని పెడర్ధంతో ఆ వీడియో, ఆ కామెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

అసలే హాట్‌ బ్యూటీ. పుసుక్కున అలా అనేస్తే ఎలా మరి. పాపం సాగరకన్య ఇదంతా ఆలోచించలేదు కాబోలు. ఫన్నీగా అనేసిన ఆ మాట ఇప్పుడు నెట్టింట్లో రచ్చ రచ్చ అయిపోతోంది. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన శిల్పాశెట్టి, తెలుగులో వెంకటేష్‌, బాలకృష్ణ, మోహన్‌బాబు వంటి స్టార్‌ హీరోలతో నటించింది. వాణిజ్య ప్రకటనల్లో కూడా శిల్పాశెట్టి తన అందమైన ఫిజిక్‌తో అందర్నీ ఎట్రాక్ట్‌ చేస్తుంటుంది. యోగా బ్యూటీ కదా ఫిజిక్‌లో ఎప్పుడూ పర్‌ఫెక్ట్‌గా ఉంటుందీ బ్యూటీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS