బాలయ్య సరసన విద్యాబాలన్‌ ఫిక్సయ్యిందా?

By iQlikMovies - March 28, 2018 - 17:28 PM IST

మరిన్ని వార్తలు

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా తెరకెక్కుతోన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర 'ఎన్టీఆర్‌' చిత్రానికి కాస్టింగ్‌ పనులు దాదాపు పూర్తయినట్లేనని విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ భార్య అయిన 'బసవతారకం' పాత్ర ఎంతో కీలకం. ఆ పాత్రకు గత కొంత కాలంగా బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ని ఎంచుకోనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

అయితే ఆ విషయంలో చిత్ర యూనిట్‌ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. అందుకే వివిధ భాషల నుండి కూడా నటీనటుల ఎంపిక జరిగిందట. అందులో భాగంగానే బాలీవుడ్‌ నుండి విద్యా బాలన్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. డిగ్నిఫైడ్‌ క్యారెక్టర్స్‌ని పండించడంలో విద్యాబాలన్‌ దిట్ట. 

అందుకే ఆ పాత్రకు తెలుగులో అనుష్క తదితర సీనియర్‌ భామలున్నప్పటికీ, విద్యాబాలన్‌నే ఎంచుకోవాలని చిత్ర యూనిట్‌ భావించిందట. అయితే ఈ పాత్ర పోషించేందుకు విద్యా ఒప్పుకుందా అంటే, అవునంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. అయితే ఈ విషయంలో అఫీషియల్‌ ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని బాలయ్య తొలిసారిగా తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. 

అంతేకాదు, తెలుగుతో పాటు, వివిధ భాషల నుండి సినీ, రాజకీయ ప్రముఖులను ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఆహ్వానించనున్నారు బాలయ్య. తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS