పాప్ సింగ‌ర్ ని హీరోయిన్ చేసిన శౌర్య‌

By iQlikMovies - November 21, 2020 - 10:35 AM IST

మరిన్ని వార్తలు

నాగశౌర్య క‌థానాయ‌కుడిగా ఐరా క్రియేష‌న్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. `అలా ఎలా`తో ఆక‌ట్టుకున్న‌ అనీష్ కృష్ణ ద‌ర్శ‌కుడు. ఇందులో క‌థానాయిక‌గా షెర్లీ సేఠియాని ఎంచుకున్నారు. త‌నో పాపుల‌ర్ పాప్ సింగ‌ర్‌. బాలీవుడ్ లో బాగా ఫేమ‌స్‌. ఇప్పుడు ఈ సినిమాతో చిత్ర‌సీమ‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది.

 

నాగ‌శౌర్య సొంత సినిమా `ఛ‌లో`తో ఇలానే... ర‌ష్మిక‌ని టాలీవుడ్ లోకి తీసుకొచ్చారు. త‌ను సూప‌ర్ స్టార్‌గా ఎదిగింది. మ‌రి.. షెర్లీ జాత‌కం ఎలా ఉంటుందో చూడాలి. మ‌హ‌తి సాగ‌ర్ సంగీతం అందిస్తున్నాడు. ఇదో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌. స్క్రిప్టు పూర్తి స్థాయిలో సిద్ధ‌మైంది. ప్ర‌స్తుతం `గాలి సంప‌త్‌` సినిమాతో బిజీగాఉన్నాడు అనీష్ కృష్ణ‌. అది పూర్త‌యిన వెంట‌నే.. నాగ‌శౌర్య చిత్రం ప‌ట్టాలెక్కుతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS