గుస గుసల సావిత్రక్క: త్యాగం వృథా ఐపాయె!

మరిన్ని వార్తలు

నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా ఈ సారి జంటలు జంటలుగా కన్‌ఫేషన్‌ రూమ్‌కి పిలిచాడు బిగ్‌బాస్‌. ఇద్దరిలో ఎవరు ఒకరు నామినేట్‌ అవ్వాలి. ఇంకొకరు సేఫ్‌ అవ్వాలి అని సూచించారు. ఆ క్రమంలో రోహిణి - స్నేహ పూర్వకంగా సావిత్రక్క తనకు తాను నామినేట్‌ అయ్యి, రోహిణిని సేవ్‌ చేసింది. ఇక్కడ త్యాగం బాగానే ఉంది. కానీ, బయటికొచ్చాక, నామినేషన్‌ ప్రక్రియ గురించి ముచ్చటించకూడదన్న బిగ్‌బాస్‌ నియమాల్ని ఉల్లంఘించినందుకు వీరిరువురూ ఈ వారంతో పాటు, వచ్చే వారం కూడా డైరెక్ట్‌గా నామినేట్‌ అయ్యారు.

 

నామినేషన్‌ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో గుసగుసలాడుకోవడం నిషేధం. గతంలో ఇదే కారణంతో వితికా ని బిగ్‌బాస్‌ హెచ్చరించారు. ఆ కారణంగా వితిక తోటి హౌస్‌మేట్స్‌ని నామినేట్‌ చేసే అవకాశం కోల్పోయింది. ఆ ఎక్స్‌పీరియన్స్‌తోనే వితిక, రోహిణి - శివజ్యోతిలను అలర్ట్‌ చేసింది కూడా.

 

అయినా, వీరిరువురి గుసగుసల ఓవరాక్షన్‌ ఎక్కువయ్యేసరికి బిగ్‌బాస్‌ ఆగ్రహానికి గురి కాక తప్పలేదు. మేం మాట్లాడుకోలేదు.. అంటూ అడ్డంగా బొంకేయడానికి ప్రయత్నించారు కానీ, బిగ్‌బాస్‌ దగ్గర అలాంటి పప్పులేం ఉడకవ్‌ కదా. అలా రోహిణి, శివ జ్యోతి అడ్డంగా బుక్కయిపోయారు. స్నేహం కోసం చేసిన త్యాగం ఓవరాక్షన్‌ కారణంగా అలా వృధా అయిపోయింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS