బాబా భాస్కర్ అంటే బిగ్ హౌస్‌లో ఇంటి పెద్దగా చెలామణీ అవుతున్నారు. మంచోడు అనే ట్యాగ్ కూడా ఉంది. అయితే, మెల్లమెల్లగా ఆ మంచితనం పక్కదారి పట్టేస్తోంది. ఒక్కొక్కరుగా బాబా భాస్కర్‌ని అపార్ధం చేసుకోవడం మొదలు పెట్టారు. ఆయన పట్ల నెగిటివిటీని వెళ్లగక్కుతున్నారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా, మొన్న పునర్నవి చేసిన ఓవరాక్షన్ ఒకెత్తయితే, ఇప్పుడు ఆషూ రెడ్డి కూడా తన బుద్ది బయట పెట్టేసుకుంది. కిచెన్ డ్యూటీ విషయమై ఈ వారం హౌస్ మేట్స్ మధ్య డిస్కషన్ జరిగింది.
గత 15 రోజులలాగే, ఈ వారం కూడా తానే కిచెన్ డ్యూటీని టేకప్ చేస్తానని బాబా భాస్కర్ చెప్పారు. కానీ, ఆయన నిర్ణయం హౌస్‌లో కొందరికి నచ్చలేదు. పునర్నవితో పాటు, కొందరు వ్యతిరేకించారు. ఆ లిస్టులో ఆషూ రెడ్డి కూడా ఉందన్న సంగతి నామినేషన్ ప్రక్రియ జరిగినప్పుడు బయట పడింది. ఆషూ, బాబా భాస్కర్ ఇద్దరిలో ఒకరు సేఫ్ అవ్వాలి. ఇంకొకరు నామినేట్ అవ్వాలి. కానీ, బాబా భాస్కర్ తానే సెల్ఫ్ నామినేట్‌డ్ అని చెప్పారు. అక్కడితో ఈ ప్రక్రియ పూర్తయిపోయింది.
కానీ, ఆషూ రెడ్డి, సరిగ్గా ఇదే సమయంలో బాబా భాస్కర్‌పై తనకున్న ఇంటర్‌నల్ ఫీలింగ్‌ని బయట పెట్టింది. 'నిజానికి నేనే మిమ్మల్ని నామినేట్ చేయాలనుకున్నాను మాస్టర్.. కిచెన్ డ్యూటీ విషయంలో మీరు చెప్పిన నిర్ణయం నాకు నచ్చలేదు..' అంటూ అర్ధం పర్ధం లేని కారణం చెప్పింది. దాంతో బాబా భాస్కర్ చాలా హర్ట్ అయ్యారు. ఆయన హర్ట్ అయిన విధానం చూస్తుంటే, ఈ వారం హౌస్ నుండి బయటికి వెళ్లేది ఆయనే అనిపిస్తోంది.