డా.రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటైన `మా` మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త టీమ్ రెండేళ్ల కాల పరమితి పూర్తయిన సందర్భంగా మా టీమ్ మంగళవారం సాయంత్రం హైదరబాద్ ఫిలిం ఛాంబర్ లో చివరి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా జనరల్ సెక్రెటరీ శివాజీ రాజా మాట్లాడుతూ ` రెండు సంవత్సరాలు క్రితం రెండు కమిటీలు గాస్టార్ట్ అయినా ఎలక్షన్ అయిపోయిన వారానికి ఒకటై అంతా కలిసి `మా` ను ముందుకు తీసుకెళ్లాం. ఈ రెండు సంవత్సరాలు నాకు మా సభ్యులంతా ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఎన్నికలు ముందు మేము ఇచ్చి హమీలు నిలబెట్టుకున్నప్పుడే నిజమైన హీరోలమని ఆరోజు అన్నాం కాబట్టే ఈ రోజు ఆ మాట గుర్తు చేస్తున్నా. నరేష్ గారు సర్వే చేసి అందరికీ సమన్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు. అందులో నూటికి నూరుశాతం సక్సెస్ అయ్యారు. కృష్ణ గారు, చిరంజీవిగారు, మోహన్ బాబు గారు, బాలకృష్ణగారు, నాగార్జున గారు, సురేష్ బాబు గారి అందరి సహకారం ఉంది కాబట్టే `మా`ను ఇంత గొప్పగా రన్ చేయగలిగాం. విజయ నిర్మల గారు ఎప్పుడూ మాకు సహాయం చేశారు. అలాగే మా మెంబర్ల కోసం బైక్స్ కు కూడా కొనుగోలు చేశాం. వాటిని దాసరి గారు చేతుల మీదుగా త్వరలో సభ్యులకు అందజేయడం జరుగుతుంది` అని అన్నారు.
జాయింట్ సెక్రటరీ నరేష్ మాట్లాడుతూ `మా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రెసెడెంట్ గా చేసిన వారంతా అందరూ కూడా తమ మార్క్ ను ప్రూ చేసుకున్నారు. కానీ గతసారి క్షీరసాగర మదనం జరిగింది. ఈ రెండు సంవత్సరాలు మేము మంచి పేరు కోసం పనిచేయలేదు. మనుషులుగా పనిచేశాం. అందరి సలహాలు తీసుకుని మా ను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాం. 750 మంది ఉన్న వారిలో ఎంత లబ్ది చేకురుతుందన్న దానిపై సర్వే చేసి వాళ్లకు తగిన విధంగా న్యాయం చేశాం. పెన్షన్లు, ఇన్సురెన్స్ , ఎడ్యుకేషన్ లోన్స్, బ్యాంక్ లోన్స్, మెడికల్ క్లైమ్ అన్నీ కల్పించడం జరిగింది. జాబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసి వాళ్లకు ఉపాధి కల్పించడం జరిగింది. 35 నుంచి 40 మందికి వేషాలు వేసే అవకాశం కల్పించాం. వీలైనంత వరకూ అందరికి అన్నీ సమకూర్చాం. మంచి టీమ్ కుదిరింది కాబట్టే ఇన్ని పనులు చేయగలిగాం. మా చరిత్రలో ఎవ్వరూ చేయని విధంగా జనరల్ సెక్రటీరీ గా శివాజీ రాజా చాలా కష్టపడి పనిచేశాడు. ఆయనే గనుక లేకపోతే ఈ పనులు ఎలా జరిగేవి అన్నది ఒక ప్రశ్నలా ఉండేది. ఇటీవలే దాసరి నారాయణరావు, కృష్ణ గారిని కలిసి `మా` పరిస్థితులను వివరించడం జరిగింది. పోటీ లేకుండా ఈసారి మా కొత్త కమిటీని ఎన్నుకుంటే బాగుంటుందని ఆయన తో చేప్పా. ఆయన కూడా సరేనని అన్నారు. శివాజీ రాజా ను `మా` కొత్త ప్రెసిడెంట్ గా ప్రపోజ్ చేస్తున్నా. రాజేంద్ర ప్రసాద్, పరుచూరి వెంకటేశ్వరరావు గారు కూడా అందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేశారు` అని అన్నారు.
వైస్ ప్రెస్ డెంట్ శివకృష్ణ మాట్లాడుతూ ` పోటీ లేకుండా ఏకగ్రీవంగా కొత్త టీమ్ ఏర్పాటైతే బాగుంటుందని ప్రపోజ్ చేసింది నేనే. గతంలో ఎన్నికలు రసాభసగా జరిగాయి. మా కు అలాంటి పరిస్థితులు రాకూడదనే నా నిర్ణయాన్ని చెప్పా. ఎన్నికలు సమయంలో పొరపొచ్చాలొచ్చినా తర్వాత అందరం కలిసే పనిచేశాం. ఎక్కడా ఎలాంటి రాజకీయాలు జరగలేదు. మేము ఇంత బాగా పనిచేశామన్నా విషయం ఇంకా పూర్తిగా తెలియలేదు. మీడియా `మా ` చేసిన పనుల గురించి ప్రజలకు తెలిసేలా చేయాలి` అని అన్నారు.
ఈసీ మెంబర్ గీతాంజలి మాట్లాడుతూ ` రెండు సంవత్సరాలు ఎలా గడిచిపోయయో తెలియడంలేదు. నాకు ఈ బాడీలో చిన్న అవకాశం ఇచ్చారు కాబట్టి నా వంత సహకారాన్ని అందించా. ఒక ఫ్యామిలీలా కలిసి పనిచేశాం. మా లో మళ్లీ కలిసి పనిచేసే అవకాశం కల్గుతుందని ఆశిస్తున్నా` అని అన్నారు.