జయలలితతో శోభన్ బాబు ప్రేమ.. 'తలైవి' క్లారిటీ..?

మరిన్ని వార్తలు

తమిళనాట అభిమాన దివంగత ముఖ్యమంత్రి అమ్మ 'జయలలిత' జీవితం ఆధారంగా, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రాసిన స్టోరీతో తమిళ డైరెక్టర్ 'ఏ ఎల్ విజయ్' దర్శకత్వంలో 'తలైవి' పేరుతో బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జయలలిత పాత్రలో బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్ నటిస్తోంది. ఇప్పటికే ఈ బయోపిక్ కోసం ప్రత్యేకంగా తమిళం కూడా నేర్చుకుంటుందట ఈ బాలీవుడ్ క్వీన్. అయితే.. ఈ సినిమాలో పలు ఆసక్తికరమైన విషయాలు కూడా ఉంటాయట.

 

ముఖ్యంగా అలనాటి అమ్మాయిల కలల హీరో శోభన్ బాబు - జయలలిత మధ్య అనుబంధం పై వచ్చిన రూమర్స్ లో వాస్తవం ఎంత.. వారి మధ్య నిజంగానే ప్రేమ ఉందా.. ఏ కారణాల చేత వాళ్ళు పూర్తిగా దూరం అవ్వాల్సి వచ్చింది.. అలాగే రాజకీయంగా జయలలిత పై జరిగిన కుట్రలు, అసెంబ్లీలో ఆమె పై జరిగిన దాడుల్లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి పాత్ర ఎంత ఉంది లాంటి అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

 

అదేవిధంగా జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె ఆలోచనా విధానాన్ని కూడా సినిమాలో హైలెట్ చేస్తూ స్క్రీన్ ప్లే సాగుతుందని... వాటిల్లో ప్రధానంగా తమిళ రాజకీయాలను జయలలిత ఎలా శాసించగలిగారు ? ఆ క్రమంలో ఆమె ఎదురుకున్న సవాళ్లు ఏమిటి ? అసలు ఎలాంటి స్థాయి లేని వ్యక్తులకి కూడా టికెట్లు ఇచ్చి ఎలా గెలిపించుకోగలిగారు ? అనే విషయాలను కూడా ఈ చిత్రంలో ప్రధానంగా చూపించనున్నారు. మొత్తానికి అమ్మ బయోపిక్ లో ఆమె జీవితంలోని ఎవ్వరికీ తెలియని విషయాలు కూడా తెలియనున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS