స్విమ్‌ సూట్‌లో సెక్సీ 'గొడవ'!

మరిన్ని వార్తలు

అప్పుడెప్పుడో 'గొడవ' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ శ్రద్ధా ఆర్య. ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్‌ హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. సినిమాకి పెద్దగా గుర్తింపు దక్కలేదు. దాంతో హీరో, హీరోయిన్లు కూడా తమ ఉనికిని నిలబెట్టుకోకలేకపోయారు. హీరోగా వైభవ్‌ ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించాడు. కానీ పెద్దగా గుర్తింపు దక్కించుకోలేదు. ఇకపోతే హీరోయిన్‌ శ్రద్ధా ఆర్య విషయానికి వస్తే, మళ్లీ ఎక్కడా కనిపించినట్లు లేదు. ఈ మధ్యనే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తోంది.

 

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ అయ్యారంటే, మళ్లీ బిగ్‌ స్క్రీన్‌పై వెలిగిపోవాలనే కదా. అందుకే ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టింది. హాట్‌ హాట్‌ బికినీల్లో కాక రేపుతోంది. తాజా పిక్‌ విషయానికి వస్తే, స్కై బ్లూ కలర్‌ టూ పీస్‌ బికినీలో శ్రద్ధా ఆర్య వయ్యారాలు కుర్రోళ్ల మతులు పోగొట్టేలా ఉన్నాయి. స్విమ్మింగ్‌ పూల్‌ నుండి అప్పుడే బయటికి వచ్చి, అలా అలా వయ్యారంగా నడుస్తూ, చల్లగాలికి ముఖంపై ఎగిరి పడిన నీలి ముంగురులను చేతితో అలా పక్కకు తోస్తూ నడుచుకొస్తున్న ఈ అందాల దేవత అందాన్ని వర్ణించకపోతే గొడవయిపోదూ మరి. బ్యాక్‌ గ్రౌండ్‌లో గ్రీనరీ అమ్మడి గ్లామర్‌కి మరింత బ్రైట్‌ లుక్‌ ఇస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS