సూర్య ఈ సారైనా కొడతాడా?

By iQlikMovies - May 29, 2019 - 14:00 PM IST

మరిన్ని వార్తలు

సూర్య తాజా చిత్రం 'ఎన్‌జీకే' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ భారీగా ప్రమోషన్స్‌ నిర్వహిస్తున్నారు. సూర్యకి తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఉంది. కానీ, గత చిత్రం 'గ్యాంగ్‌' తెలుగులో పెద్దగా కలెక్ట్‌ చేయలేదు. దాంతో సూర్య మార్కెట్‌ కాస్త డల్‌ అయినట్టు కనిపించింది. కానీ, ఈ సారి 'ఎన్‌జీకే'తో సూర్య గట్టిగా కొట్టేలా ఉన్నాడు. ఈ వారం సూర్య సినిమా తప్ప మరో పెద్ద సినిమా లేకపోవడంతో అది సూర్యకి కలిసొచ్చే అంశమే.

 

మాస్‌ ఆడియన్స్‌ ఈ సినిమాకి బాగా కనెక్ట్‌ అయ్యే ఛాన్సుంది. రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఏదో తమిళనాడు రాజకీయాలకు సంబంధించిన కాన్సెప్ట్‌ కాదిది. యూనివర్సల్‌గా కనెక్ట్‌ అయ్యేలా స్క్రీన్‌ప్లేని సిద్ధం చేశాడు డైరెక్టర్‌ సెల్వ రాఘవ. హీరోయిన్లు ఈ సినిమాకి మరో ఆకర్షణ. సాయి పల్లవికి తెలుగులో పిచ్చ క్రేజ్‌ ఉంది. ఈ సినిమాలో సాయి పల్లవి సూర్యకి భార్యగా నటిస్తోంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంతవరకూ రకుల్‌ని గ్లామర్‌ రోల్స్‌లోనే చూశారు తెలుగు ప్రేక్షకులు.

 

కానీ ఈ సినిమాలో రకుల్‌ ఓ ఆఫీసర్‌ పాత్రలో డిగ్నిఫైడ్‌ లుక్‌లో కనిపించబోతోంది. ఇక్కడా అక్కడా కూడా ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటోంది రకుల్‌. 'ఎన్‌జీకే' అన్ని వర్గాల వారికీ సరికొత్త ఫీలింగ్‌ని ఇవ్వబోతోందనీ సూర్య చెబుతున్నారు. చూడాలి మరి ఈ సారైనా సూర్య తన మార్కెట్‌ని పెంచుకుంటాడో లేదో చూడాలిక. అయినా కథలో కంటెంట్‌ ఉంటే, మార్కెట్‌తో సంబంధం లేకుండా మూడు భాషల్లోనూ కన్నడ మూవీ 'కేజీఎఫ్‌' దుమ్ము దులిపేయలే. 'ఎన్‌జీకే'తో సూర్య ఏం చేస్తాడో లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS