'సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో పాపులర్ అయిన ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్‌కి స్టార్‌డమ్ మాత్రం అనుకున్న స్థాయిలో దక్కడం లేదు. కేవలం తెలుగులోనే కాదు, తమిళ, హిందీ, మలయాళ, బెంగాళీ సినిమాల్లోనూ నటించిన శ్రద్ధాదాస్, ఎక్కువగా తెలుగు, హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. అయితే, ఇక్కడా, అక్కడా కూడా అంతంత మాత్రంగానే కెరీర్‌ని నడిపిస్తోంది. మొహమాటం లేకుండా, అందాలారబోయగల స్టామినా ఉంది. యాక్టింగ్ టాలెంట్‌లోనూ అమ్మడికి వంకలు పెట్టడానికేమీ లేదు.
కానీ, ఎందుకో టెంపరరీ క్యారెక్టర్స్ కోసం తప్ప, ఫుల్ లెంగ్త్ హీరోయిన్‌గా శ్రద్ధాదాస్‌కి అవకాశాలు రావడం లేదు. కానీ, ఎప్పుడూ ఏదో ఒక భాషలో సినిమాలు చేస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా కనిపిస్తుంది. లేటెస్ట్‌గా 'హిప్పీ' సినిమాలో నటించిన శ్రద్ధాదాస్ సినిమాలతో పాటు, అప్పుడప్పుడూ వెబ్ సిరీస్‌లోనూ కనిపిస్తుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో శ్రద్ధా పోస్ట్ చేసిన పిక్ ఇప్పుడు అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది. వైట్ అండ్ వైట్‌లో గ్లామర్ హంసలా ముస్తాబై ఫోటోకి పోజిచ్చింది. పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పోత పోసిన శిల్పంలా శ్రద్ధా గ్లామర్ చూపు తిప్పుకోనీయకుండా చేస్తోంది.