ఎక్స్పోజింగ్ చేస్తేనే హాట్ అప్పీల్ అని అనగలమా.? క్యూట్‌గా కూడా హాట్ అప్పీల్ పండించేయొచ్చనడానికి ఇదిగో ఈ ఫొటోనే నిదర్శనం అనుకోవాలేమో. తెలుగు ప్రేక్షకులకు ఈ భామ కాస్త పరిచయమే. సంఖ్యా పరంగా చెప్పుకోదగ్గ సినిమాలే చేసిన ఈ బెంగాలీ బ్యూటీకి, కమర్షియల్ సక్సెస్‌లు చాలా చాలా తక్కువగా వున్నాయి. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోన్న ఈ బ్యూటీ పేరు శ్రద్ధా దాస్ అని ప్రత్యేకంగా చెప్పాలా? మంచి డాన్సర్.. దాంతోపాటు సింగర్ కూడా.
అన్నిటికీ మించి ఫిట్నెస్ ఎక్స్పర్ట్ కూడా. అన్నీ వున్నా ఏదో డాష్ డాష్ అన్నట్లు.. సరైన సక్సెస్ దొరక్క, ఈ అందానికి అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయి. వర్కవుట్ కాస్ట్యూమ్స్‌తో ఈ బ్యూటీ క్యూట్ సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. చెక్కిన శిల్పం.. అని ఇలాంటి అందాల భామల్నే అంటుంటాం మరి.