అప్పుడెప్పుడో అల్లరి నరేష్ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్. హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఈ ముద్దుగుమ్మలో పుష్కలంగా ఉన్నాయి. కానీ, అవకాశాలు మాత్రం అరుదుగానే పలకరిస్తున్నాయి. అప్పుడప్పుడూ ఒకటీ అరా సినిమాల్లో తళుక్కున మెరుస్తూ కనిపిస్తోంది ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్. అవి కూడా చెప్పుకోదగ్గ సినిమాలు కావు. నోటీస్ చేయదగ్గ పాత్రలూ కావు. సినిమాల్లో అవకాశాలెలా ఉన్నా, ఫిజిక్‌ని మెయింటైన్ చేయడంలో శ్రద్ధా టాప్ అని చెప్పక తప్పదు. అందుకే ఆ ఫిజిక్‌ని ఆరాధించే నెటిజన్స్ కోసం రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో సెషన్స్ పోస్ట్ చేస్తుంటుంది.
తాజాగా శ్రద్దాదాస్ పోస్ట్ చేసిన పిక్స్లోంచి ఓ అద్భుతమైన పిక్ ఒకటి మీ కోసం తళుక్కుమంటోంది. ఆరెంజ్ కలర్ బ్రైట్ మోడ్రన్ అండ్ ట్రెడిషనల్ టచ్ వేర్లో శ్రద్ధాదాస్ తన అందాల్ని అద్దంలో చూసుకుని చిరునవ్వులు చిందిస్తూ ఎలా మురిసిపోతోందో చూస్తున్నారుగా. నిజంగా సింప్లీ సూపర్స్ బ్యూటీలుక్స్ ఇవి. ఇక ఈ హాట్ భామ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.