ప్రభాస్- మొన్నటివరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాప్ హీరో. కాని బాహుబలి రిలీజ్ తరువాత అతని రేంజ్ అమాంతం పెరిగిపోయింది.
అతని రేంజ్ గురించి ఉదాహరణ చెప్పాలంటే- అతని పక్కని నటించే ఛాన్స్ దొరికిన వారు కూడా తమ రెమ్యునరేషన్ డబల్ చేస్తున్నారు. ఇది ప్రభాస్ కి ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న క్రేజ్.
ఇప్పుడ ఈ క్రేజ్ అతని చేయబోయే సాహో చిత్రం పై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ప్రభాస్ పక్కన చేయాడానికి ప్రతి హీరోయిన్ రూ 5 కోట్లకు పైగా డిమాండ్ చేస్తుండడంతో నిర్మాతలు తలలు పట్టుకుంట్టున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ శ్రద్ధా కపూర్ రూ 8కోట్లు, దిశా పటాని రూ 5 కోట్లు డిమాండ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
మరి సాహో చిత్ర నిర్మాతలు ఈ సమస్యకి పరిష్కారం ఎలా కనుగొంటారో చూడాలి.