ఆమె సెక్సప్పీల్‌కి 'సాహో'రే!

By iQlikMovies - November 05, 2018 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌, తెలుగులో తొలిసారిగా 'సాహో' సినిమాలో నటిస్తోన్న సంగతి తెల్సిందే. ఓ వైపు 'సాహో' చేస్తూనే, ఇంకో వైపు బాలీవుడ్‌లో చాలా సినిమాల్ని చక్కబెట్టేస్తోంది శ్రద్ధా కపూర్‌. దీపం వున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు, గ్లామర్‌ వున్నప్పుడే అవకాశాలు కొల్లగొట్టేయాలనే అందాల భామల ఆలోచనల్ని ఎలా తప్పుపట్టగలం. విషయానికొస్తే, బ్లాక్‌ డ్రస్‌లో హాట్‌ హాట్‌గా వెలగిపోతోన్న ఈ 'గ్లామరస్‌ బాంబ్‌', లేటెస్ట్‌గా బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ఖాన్‌ ఇంట్లో జరిగిన దివాళీ ముందస్తు వేడుకల్లో పాల్గొంది. అక్కడే కెమెరాలు ఆమెను ఇదిగో ఇలా క్లిక్‌ మనిపించేశాయి. దీపావళి టపాసులదేముంది.? కాస్సేపు వెలుగులే. శ్రద్ధా కపూర్‌ గ్లామర్‌కి మాత్రం హద్దుల్లేవ్‌ అన్పిస్తోంది కదూ.! శ్రద్ధా కపూర్‌తోపాటు, కత్రినా, జాక్వెలైన్‌, అలియా తదితర బ్యూటీస్‌ ఈ వేడుకలో కన్పించినా, సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌ అయ్యింది మాత్రం 'సాహో' బ్యూటీనే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS