ఆర్జీవీ 'లక్ష్మీపార్వతి' ఆమె కాదు

మరిన్ని వార్తలు

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాకి లక్ష్మీపార్వతి పాత్రధారి దొరికేసిందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెల్సిందే. మోడల్‌ రూపాలిని ఈ సినిమా కోసం ఆర్జీవీ ఎంపిక చేశాడన్నది ఆ గాసిప్స్‌ సారాంశం. అయితే ఈ గాసిప్స్‌ని రామ్‌గోపాల్‌ వర్మ ఖండించాడు. 

వార్తల్లో విన్పిస్తున్నట్లుగా రూపాలిని 'లక్ష్మీస్‌ఎన్టీఆర్‌' సినిమా కోసం సంప్రదించలేదు. తిరుపతికి వెళ్ళినప్పుడు, అక్కడ మా భాగస్వాముల్లో ఒకరి భార్యకు స్నేహితురాలైన రుపాలి పరిచయం అయ్యిందంతే.. అని వర్మ తేల్చేశాడు. ఈ సినిమాతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని వర్మ క్లారిటీ ఇచ్చాడు. దాంతో రూపాలి 'లక్ష్మీ పార్వతి' పాత్రలో నటిస్తోందన్న గాసిప్స్‌కి తెరపడింది. 

ఇదిలా వుంటే, 'లక్ష్మీస్‌ఎన్టీఆర్‌' సినిమాకి లక్ష్మీ పార్వతి పాత్ర ఎంతో కీలకం గనుక, ఆమె పాత్రలో నటించబోయే నటి కోసం ఆర్జీవీ అన్వేషణ తీవ్రస్థాయిలోనే జరుగుతోందట. మంచి నటనా ప్రతిభతోపాటు, సూపర్బ్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ వుండాలన్న కోణంలో ఈ అన్వేషణ జరుగుతోందని తెలుస్తోంది. ఆమెను బాలీవుడ్‌ నుంచి తీసుకొస్తారా.? తెలుగమ్మాయినే ఎంపిక చేస్తారా.? అనేది సస్పెన్స్‌గా మారింది. 

లక్ష్మీపార్వతి పాత్రలో నటించబోయే నటి ఖరారైతే, ఆ వెంటనే మిగతా పాత్రధారుల్నీ ఎంపిక చేసేయనున్నారు. కథ విషయమై ఇప్పటికే వర్మ పూర్తి క్లారిటీతో వున్నాడు. జనవరిలో ఈ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాని విడుదల చేయనున్న వర్మ, ఇందుకోసం పూర్తిస్థాయిలో ముందస్తు కసరత్తులు పూర్తి చేసుకోవడం తప్పనిసరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS