గ్లామ్‌షాట్‌: 'శ్రద్ధ'గా సొగసులారేసింది.!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ పర్‌ఫామెన్స్‌కే కాదు, గ్లామర్‌కీ ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ఏ కాస్ట్యూమ్‌ అయినా ఈజీగా సెట్‌ అయిపోయే ఫిజిక్‌ ఆమె సొంతం. చూశారుగా రెడ్‌ హాట్‌ కాస్ట్యూమ్‌లో శ్రద్ధాకపూర్‌ అందాలు ఎలా మెరిసిపోతున్నాయో.

బాలీవుడ్‌లో ఫుల్‌ బిజీగా సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్‌. తెలుగులో 'సాహో' సినిమాతో ప్రబాస్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌లో ఎంత బిజీగా ఉన్నా, దక్షిణాది సినిమాలంటే తనకెంతో గౌరవమనీ, మంచి ఆఫర్లు వస్తే ఇక్కడ వరుసగా సినిమాలు చేసేందుకు తనకేం అభ్యంతరాలు లేవని శ్రద్ధా చెబుతోంది.

'సాహో'లో ప్రబాస్‌కి పోటీగా యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో పర్‌ఫామెన్స్‌ కెవ్వుకేక పెట్టించేలా ఉంటుందట. అలాగే గ్లామర్‌ కూడా మిస్‌ కానంటోందీ మిస్‌ శ్రద్ధాకపూర్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS