బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ 'సాహో' సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఓ న్యూ అప్డేట్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర అత్యంత ప్రాధాన్యత ఉన్నది. అందుకే ఏరికోరి ఆ పాత్రకి శ్రద్ధాకపూర్‌ని ఎంచుకున్నారు. అయితే ఈ సినిమాలో శ్రద్దాకపూర్ సింగిల్ రోల్ కాదు, డబుల్ రోల్ అంటూ ప్రచారం సాగుతోంది. అందులో ఒకటి ఇన్నోసెంట్ క్యారెక్టర్ కాగా, మరో పాత్ర వెరీ వెరీ పవర్ఫుల్ అట. ంండో పాత్ర కోసం శ్రద్ధా పూర్ యాక్షన్ సీన్స్‌లోనూ నటించాల్సి ఉంటుందట. ఆమెకి యాక్షన్ కొత్తేం కాదు. బాలీవుడ్లో 'బాఘీ' సినిమా కోసం హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి పోటా పోటీగా ఫైట్లు ఇరగదీసింది ఈ ముద్దుగుమ్మ. అలాగే ఇప్పుడు 'సాహో'లోనూ యాక్షన్ సీన్స్ దుమ్ము రేపనుందట శ్రద్ధా. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'బాహుబలి' తర్వాత ప్రబాస్ నటిస్తోన్న చిత్రమిది. యాక్షన్ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. యాక్షన్ సీన్స్‌ని హాలీవుడ్ స్థాయిలో చిత్రీకరించనున్నారట. తెలుగుతో పాటు హిందీ ఇతర భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేయనున్నారు. యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోంది. శ్రద్ధా కపూర్ ఎప్పట్నుంచో తెలుగులో నటించాలనుకుంటోందట. 'సాహో' రూపంలో ఆ అవకాశం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు 'సాహో'లో తన పాత్రను చాలా ఛాలెంజింగ్‌గా తీసుకుంటోందట శ్రద్ధాకపూర్.