ఇటీవలే బాలయ్య వందో చిత్రంగా వచ్చిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి'లో బాలయ్య - శ్రియ జంట సందడి చేసింది. సూపర్ డూపర్ హిట్ కొట్టింది ఈ జంట ఈ సినిమాతో. బ్యాక్ టు బ్యాక్ మళ్లీ 'పైసా వసూల్'లోనూ బాలయ్య, శ్రియతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు. సక్సెస్ కంటిన్యూ అయ్యింది. ఇదే సక్సెస్‌ని ముచ్చటగా మూడో సారి కంటిన్యూ చేయనున్నారట. బాలయ్య లేటెస్ట్ మూవీలోనూ శ్రియకి ఛాన్స్ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇది బాలయ్యకి 103వ చిత్రం. కె.యస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలయ్య, శ్రియకి పిలిచి మరీ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ పాత్ర సినిమాకి ఎంతో కీలకమట. 'శాతకర్ణి'లో శాతకర్ణి భార్యగా చాలా బరువైన పాత్రనే పోషించింది శ్రియ. అందుకు మెచ్చిన బాలయ్య ఈ సినిమాలో ఆ పాత్ర కోసం శ్రియ అయితే బాగుంటుందని సలహా ఇచ్చారట. దాంతో మళ్లీ శ్రియ, బాలయ్య కలిసి నటించబోతున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. పదేళ్లకు పైగానే శ్రియ తెలుగు చిత్ర సీమలో హీరోయిన్గా కొనసాగుతోంది. ఎంతమంది కొత్త భామలు వచ్చినప్పటికీ, ఆమెకున్న క్రేజ్ తగ్గడం లేదు. బాలయ్య సినిమాతో ఆమె అదృష్టం మరీ పెరిగింది. ఎలాంటి క్యారెక్టర్‌నైనా పండించగల సత్తా ఉంది శ్రియలో. హీరోయిన్‌గానే కాకుండా, పలు ఐటెం సాంగ్స్‌లోనూ శ్రియ తనదైన శైలితో, ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఇప్పటికే మెయిన్ హీరోయిన్గా నయనతారను ఎంచుకున్నారు. మరో కొత్త భామ నటాషా దోషి కూడా నటిస్తోంది. ఒకవేళ శ్రియ క్యారెక్టర్ కన్ఫామ్ అయితే మరోసారి ముగ్గురు భామలతో బాలయ్య దుమ్ము రేపనున్నారన్న మాటే.