రాకెట్‌ చేతపట్టిన హాట్‌ బ్యూటీ.!

By iQlikMovies - September 29, 2018 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌లో ప్రముఖ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైన నెహ్వాల్‌ బయోపిక్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ముద్దుగుమ్మ సైనా నెహ్వాల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. రాకెట్‌ పట్టుకుని విజయోత్సాహంతో కనిపిస్తున్న సైనా నెహ్వాల్‌ పాత్రలో శ్రద్ధాకపూర్‌ ఉన్న స్టిల్‌ అది. అచ్చు సైనా నెహ్వాల్‌లాగే ఉంది శ్రద్ధాకపూర్‌. ఈ పాత్ర కోసం శ్రద్ధాకపూర్‌ చాలా చాలా కష్టపడింది. 

ఏదో సినిమా కోసం అన్నట్లుగా కాకుండా, నిజంగానే కష్టపడి బ్యాడ్మింటన్‌ నేర్చుకుంది. సైనా నెహ్వాల్‌ శిక్షణ తీసుకున్న గోపీచంద్‌ దగ్గరే శ్రద్ధాకపూర్‌ బ్యాడ్మింటన్‌లో శిక్షణ తీసుకోవడం విశేషం. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ బయోపిక్‌ రూపొందుతోంది. ఏ పాత్ర పోషించినా, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, నటిగా పూర్తి న్యాయం చేయాలని భావించే అతికొద్ది మంది నటీమణుల్లో శ్రద్ధాకపూర్‌ ఒకరు. అందుకే ఆమె డెడికేషన్‌ని అందరూ ప్రశంసిస్తుంటారు. 

మరోవైపు శ్రద్దాకపూర్‌ తెలుగులో ప్రబాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'సాహో' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కోసం శ్రద్దా కపూర్‌ తనను తాను మేకోవర్‌ చేసుకున్న విధానం కూడా మెచ్చుకోదగ్గదే. హీరోతో సమానంగా కష్టతరమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో తనదైన శ్రద్ద చూపించిందట శ్రద్ధాకపూర్‌ 'సాహో'లో. 

కథ నచ్చి, పాత్ర నచ్చితే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసేందుకు శ్రద్ధాకపూర్‌ ఎప్పుడూ ముందుంటుంది. అలా ఇటు సౌత్‌లో 'సాహో'తోనూ, అటు 'సైనా నెహ్వాల్‌' బయోపిక్‌తోనూ ఫుల్‌ బిజీగా గడుపుతోంది శ్రద్ధాకపూర్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS