'బాహుబలి' బ్లాక్ బస్టర్‌తో ప్రబాస్ సరసన నటించేందుకు బాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోయిన్లు క్యూ కట్టేశారు. వారిలో శ్రద్ధా కపూర్‌కి ఇమీడియట్గా ఆ అదృష్టం దక్కింది.
'బాహుబలి' తర్వాత ప్రబాస్ నటిస్తున్న 'సాహో' చిత్రం కోసం శ్రద్ధా కపూర్‌ని హీరోయిన్గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. అలా టాలీవుడ్లో అత్యంత భారీ బడ్జెట్, ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటిస్తూనే, అటు బాలీవుడ్‌లోనూ వరుస చిత్రాల్లో నటిస్తోంది శ్రద్ధాకపూర్. ఆల్రెడీ శ్రద్ధా కపూర్ నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఒకటి హారర్ కామెడీ చిత్రం కాగా, మరోటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఈ చిత్రాలు అతి త్వరలో విడుదల కానున్నాయి.
ఇవి కాక మరో ఇంపార్టెంట్ మూవీ ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్‌లోనూ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ బయోపిక్ కోసం ప్రొఫిషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్లా శ్రద్ధా కపూర్ బ్యాడ్మింటన్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. రియల్ లైఫ్‌లో సైనా నెహ్వాల్‌కి శిక్షణ ఇచ్చిన కోచ్ గోపీచంద్ దగ్గర సినిమా కోసం శ్రద్ధాకపూర్ శిక్షణ తీసుకోవడం ఆమెకు సినిమా పట్ల ఉన్న ప్యాషన్‌కి తార్కాణం.
కాగా మరో వైపు 'సాహో' చిత్రంలో శ్రద్ధాది అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్ర. హీరోతో పాటు, యాక్షన్ సన్నివేశాల్లో నటించాల్సి ఉందట. ఆల్రెడీ కొన్ని టిపికల్ షాట్స్ చిత్రీకరణలో శ్రద్ధాకపూర్ పాల్గొందట. ఆ సీన్స్ చాలా బాగా వచ్చాయనీ, 'సాహో' ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని శ్రద్ధా కపూర్ అంటోంది.