నాని హీరోయిన్‌ పెద్ద టెండరే పెట్టిందండోయ్‌.!

By iQlikMovies - April 15, 2019 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కుతోన్న 'జెర్సీ' సినిమాతో తెలుగు తెరకు పరచయమవుతోన్న ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాధ్‌. హీరోయిన్‌గా 'జెర్సీ' కన్నా ముందే తెలుగులో సైన్‌ చేసిన సినిమాలు మరో రెండున్నాయట ఈ ముద్దుగుమ్మకి. కానీ వాటి కంటే ముందు 'జెర్సీ' విడుదలవుతోంది.

 

యంగ్‌ హీరో ఆదితో 'జోడీ' సినిమాని శ్రద్ధా శ్రీనాధ్‌ మొదటగా ఓకే చేసిందట. ఆ తర్వాత సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఇంకో సినిమా ఉందట. ఇకపోతే 'జెర్సీ'లో తన పాత్ర చాలా బాగుంటుందనీ, హీరోయిన్‌గా తొలి సినిమాకే పదేళ్ల కుర్రాడికి తల్లి పాత్రలో కనిపిస్తున్నందుకు కొంచెం భయంగా ఉన్నా, ఇష్టంగా ఆ పాత్రను ఓకే చేశాను కాబట్టి, ఆ ఇష్టం ముందు ఈ కష్టం పెద్దది కాదనీ అంటోంది. ఇకపోతే 'జెర్సీ' సినిమా ఓ రకంగా బాగానే ఆకర్షిస్తోంది. సో తొలి సినిమా కలిసొస్తుందనే భరోసాతో ఉంది ఈ ముద్దుగుమ్మ. పాత్ర ఏదైనా కానీ, పర్‌ఫామెన్స్‌ ఆడియన్స్‌కి నచ్చితే చాలు అనుకునే కొద్దిమంది హీరోయిన్స్‌లో శ్రద్ధా శ్రీనాధ్‌ ముందు వరుసలో ఉండేలానే ఉంది.

 

లేకుంటే, తొలి సినిమాకే ఇంత పెద్ద రిస్క్‌ చేయదు. ఇకపోతే తన టాలెంట్‌పై తనకు నమ్మకం ఉందనీ, త్రివిక్రమ్‌, రాజమౌళి వంటి సీనియర్‌ దర్శకులతో పని చేయాలని ఉందని అంటోంది. అయితే ఇప్పుడప్పుడే ఆ కోరిక తీరేనా.? కోరుకోవడం తప్పు కాదు కదా అంతే.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS