వేశ్య పాత్రలో శ్రద్ధాదాస్‌.. అందుకేనా.?

మరిన్ని వార్తలు

ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోయిన్లు వేశ్య పాత్రల్లో నటించి మెప్పించారు. అనుష్క, శ్రియ, ఛార్మి తదితర ముద్దుగుమ్ములు తమ కెరీర్‌ ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నప్పుడే వేశ్య పాత్రలు పోషించి ఆయా పాత్రల్లో తమ నటనా ప్రతిభను నిరూపించుకున్నారు. లేటెస్ట్‌గా మరో ముద్దుగుమ్మ వేశ్య పాత్రలో కనిపించనుంది. ఆమె ఎవరో కాదు, హాట్‌ బ్యూటీ శ్రద్ధాదాస్‌. ‘సిద్దు ఫ్రమ్‌ శ్రీకాకుళం’ సినిమాతో పరిచయమై, హీరోయిన్‌గా వెలిగిపోదామని వచ్చిన ఈ ముద్దుగుమ్మ, సరైన అవకాశాల్లేక విలవిల్లాడిపోతోంది. ఎలాగోలా ఈ మధ్య అరకొర అవకాశాలతో సరిపెట్టుకుంటోందనుకోండి. కానీ అది చాలదు కదా. సో లైమ్‌ లైట్‌లో ఉండేందుకు అప్పుడప్పుడూ హాట్‌ హాట్‌ ఫోటో సెషన్స్‌తో సోషల్‌ మీడియాని హీటెక్కిస్తోంది. వీటితో పాటు, ‘లస్ట్‌ స్టోరీస్‌’ వంటి కొన్ని వెబ్‌ సిరీస్‌లతోనూ బిజీగా ఉందనుకోండి. అయితే, వెండితెరపై సత్తా చాటలేకపోతోంది.

 

తాజాగా జగపతిబాబు కీ రోల్‌ పోషిస్తున్న ఓ సినిమాలో బ్యూటీ శ్రద్ధాదాస్‌కి ఓ మంచి పాత్ర దక్కిందట. అదే వేశ్య పాత్ర. వేశ్య పాత్రయినా నటనలో బోలెడన్ని వేరియేషన్స్‌ ఉన్న పాత్ర అట. సినిమాకి ఈ పాత్ర కీలకం కావడంతో పాటు, యాక్టింగ్‌కి బాగా స్కోపుండడంతో వెంటనే కాదనకుండా ఒప్పేసుకుందట. విద్యాసాగర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో  తెలియనున్నాయి.

shradha das hot

మరి వేశ్య పాత్ర అంటే, కేవలం గ్లామర్‌ ఒలకబోసేదేనా.? లేక శ్రద్ధా చెప్పినట్లు నిజంగానే యాక్టింగ్‌ స్కోపున్న పాత్రనా.? తెలియాలంటే, ఆ సినిమా సంగతేదో తెలియాలి. అందాకా వెయిట్‌ చేయాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS