శ్రద్ధాలో యాక్షన్‌ యాంగిల్‌ చూస్తారా?

మరిన్ని వార్తలు

అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం పేరు తెలీని వారు చాలా తక్కువ మందే ఉంటారు. అలాగే ఆయన సోదరి హసీనా పార్కర్‌ గురించి కూడా చాలా మందికి తెలుసు. అన్నలానే లేడీ డాన్‌గా ముంబయ్‌లో ఆధిపత్యం చెలాయించింది హసీనా. ఈమె స్టోరీని ఇప్పుడు సినిమాగా రూపొందించనున్నారు. 'హసీనా' పేరుతో అపూర్వ లఖియా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్‌ ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ పోషిస్తోంది. ఇంతవరకూ గ్లామర్‌ పాత్రలతో ఆకట్టుకున్న ఈ భామ ఇప్పుడు డీ గ్లామర్‌ రోల్‌లో హసీనా పాత్రలో ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటానంటోంది. తాజాగా ఈ సినిమాలో 'హసీనా' ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఈ లుక్‌లో శ్రద్ధాకపూర్‌ బాగా ఎట్రాక్ట్‌ చేస్తోంది. ఆమె గెటప్‌ చాలా డిపరెంట్‌గా ఉంది. గ్రేస్‌ఫుల్‌ ఐస్‌తో కను సైగతోనే శాసించగలిగే తీక్షణమైన కళ్లతో ఉన్న ఈ ఫోటో బాలీవుడ్‌లో ఆమె అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటోంది. హసీనాకు 17 ఏళ్ల నుండి, 43 ఏళ్ల వరకూ ఆమె ముంబయ్‌ క్వీన్‌గా ఎలా ఎదిగింది అందుకు సహకరించిన పరిస్థితులేంటి అనే అంశాల్ని ఆశక్తికరంగా తెరకెక్కించారట ఈ సినిమాలో. హసీనా సోదరుడుగా ఈ సినిమాలో సిద్దార్ధ్‌ కపూర్‌ నటించాడు. శరవేగంగా ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. జులైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజా సమాచారమ్‌ ప్రకారం ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తోందని తెలుస్తోంది.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS