టైటిల్ చూసి సింగర్ నటిగా మారిపోతుందా అని అనుకునేరు! టైటిల్ కి అర్ధం అది కాదు.
వివరాల్లోకి వెళితే, ప్రముఖ గాయని శ్రేయ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ ఢిల్లీ మ్యూజియంలో పెట్టనున్నారట. ఇందుకుగాను శ్రేయని కలిసిన మ్యుజియం నిర్వాహకులు తమకు కావాల్సిన సమాచారం, శరీర కొలతలు తీసుకుని కుడా వెళ్లారట. అయితే శ్రేయ విగ్రహం ఇండియా లోని ఢిల్లీ మ్యూజియంలో ఈ సంవత్సరం జూన్ లో ఆవిష్కరిస్తారట.
హీరో ప్రభాస్ విగ్రహం బ్యాంకాక్ లోని మ్యూజియంలో ఈ నెలలో ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే మన దేశం నుండి నరేంద్ర మోది, అమితాబ్, షారుఖ్, ఐశ్వర్య తదితరుల విగ్రహాలు వివిధ దేశాల్లో ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్స్ లో ఉన్నాయి.
మొత్తానికి శ్రేయ పాపులారిటీ అంతర్జాతీయ స్థాయికి ఎగబాకింది అనడంలో ఎటువంటి సందేహంలేదు.