కరోనా లాక్‌డౌన్‌తో అన్నీ మర్చిపోయి ఎప్పుడూ బిజీ షెడ్యూల్స్‌లో మునిగి తేలే అందరికీ సభ్య సమాజంలో సంస్కారం అలవడింది. ‘నమస్కారం’ మన సంస్కారం అని పదే పదే అవుపాశన పట్టేశారు. ఇక పని వాళ్లకు సెలవులిచ్చేసి, ఇంటి పనీ గట్రా చక్కగా ఇంటి వాళ్లతో కలిసి మెలిసి చేసుకుంటున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం అనే టైటిల్‌నీ సార్ధకం చేస్తున్నారనుకోండి. ఇకపోతే, అసలు విషయమేంటంటే, అందా భామ శ్రియ ఉంది కదా.. ఈ ముద్దుగుమ్మ తన భర్తతో అంట్లు కడిగించి, ఆ వీడియో నెట్టింట్లో పోస్ట్ చేసింది. సందట్లో సడేమియా హజ్‌బెండ్‌తో ఓ లిప్‌లాక్ కూడా లాగించేసిందనుకోండి వీడియోలో. హా.. అసలు మేటర్ ఏంటంటే, బిజినెస్ మేన్ ఆండ్రూ కొచ్చివ్‌ని శ్రియ ఈ మధ్య వివాహ మాడిన సంగతి తెలిసిందే. పెళ్లయినా.. ఆయనేమో బిజినెస్‌తో, ఈవిడేమో సినిమాలతో పిచ్చ బిజీగా కాలం వెల్లిబుచ్చేశారు.
అయితే, కరోనా కారణంగా ఇప్పుడు, చక్కగా ఇంటి పట్టునే ఉండి, ఇదిగో ఇలా ఎంజాయ్ చేస్తున్నారన్న మాట. ఇకపోతే, ఇదే టైమ్‌ని నెటిజన్స్ కూడా బాగానే వాడేసుకోవట్లా.. ఫ్రెండ్‌షిప్ ఛాలెంజ్ అనీ, బెస్ట్ పిక్స్ ఛాలెంజ్ అనీ.. ఇలా. అలాగే, మన శ్రియ బ్యూటీ కూడా ఈ అంట్లు కడిగే ఛాలెంజ్‌ని కనిపెట్టి, టాలీవుడ్ హీరో బన్నీకి, కోలీవుడ్ హీరో ఆర్యకి ఆ ఛాలెంజ్ విసిరిందన్నా మాట. పాపం ఇప్పుడు బన్నీ, ఆర్య కూడా అంట్లు కడిగే ఆ నిరంతర ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని స్వీకరించి, ‘చాలెంజ్ యాక్‌సెప్ట్‌డ్’ అని వీడియోలు సిద్ధం చేయాలన్న మాట. చేస్తారో.? లేదో.? లెట్స్ వెయిట్ అండ్ సీ.