రాజమౌళి సినిమాలో ఆఫర్ అంటే.. అది అపూర్వ అవకాశమే అవుతోంది. `ఈ సినిమాలో మీరు నటిస్తారా` అని అడగడమే ఆలస్యం. ఎంతటి స్టార్ అయినా, ఎగిరి గంతేసి మరీ ఒప్పుకుంటున్నారు. శ్రియకూ అలాంటి ఆఫరే దక్కింది. `ఆర్.ఆర్.ఆర్`లో ఓ కీలకమైన పాత్రలో శ్రియ నటిస్తోంది. ఇప్పటికే శ్రియపై తీయాల్సిన సన్నివేశాల్ని చిత్రీకరించేశార్ట. `ఆర్.ఆర్.ఆర్`కి సంబంధించి శ్రియ వర్క్ ఫినిష్ అయినట్టే. ఈ సినిమా గురించి శ్రియ మనసులోని మాట బయటపెట్టింది.
''ఆర్.ఆర్.ఆర్‌లో నా పాత్ర నిడివి తక్కువే. ఓ రకంగా అతిథి పాత్ర అనుకోవొచ్చు. అజయ్ దేవగణ్‌కి జోడీగా కనిపిస్తా. ఎన్టీఆర్, చరణ్‌లతో నటించే అవకాశం రాలేదు. వాళ్లిద్దరూ ప్రతిభావంతులైన కథానాయకులు. రాజమౌళి ఓ విజన్ ప్రకారం ఈ సినిమా తీస్తున్నారు'' అని చెప్పుకొచ్చింది. 'అంధాధూన్' రీమేక్ లో శ్రియ నటిస్తున్నట్టు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై క్లారిటీ ఇచ్చింది. `''ఆ ఆఫర్ నా వరకూ వచ్చింది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ ఆఫర్ గనుక ఖరారైతే.. అదో అదృష్టంగా భావిస్తా'' అంటోంది శ్రియ.