హాట్‌ అండ్‌ స్పైసీ అందాల శ్రియ

మరిన్ని వార్తలు

'ఇష్టం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముంబై ముద్దుగుమ్మ శ్రియ, అచ్చంగా తెలుగమ్మాయిలా మారిపోయి దాదాపుగా తెలుగులో అగ్రహీరోలందరి సరసనా నటించేసింది. వసూళ్ళ రికార్డుల్ని కొల్లగొట్టిన సినిమాలతోనూ సత్తా చాటిన శ్రియ, అగ్రహీరోలే కాదు.. యంగ్‌ హీరోలతోనూ, కొత్త హీరోలతోనూ సత్తా చాటింది. ఏ సినిమా చేసినా, శ్రియ గ్లామర్‌కి వంక పెట్టలేం. 'ఇష్టం' నుంచి ఇప్పటిదాకా ఒకే గ్లామర్‌తో అస్సలేమాత్రం వన్నె తగ్గని పర్సనాలిటీతో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ ఫొటోని చూసి శ్రియకి 36 ఏళ్ళ వయసంటే నమ్మగలమా? 'సైమా' అవార్డుల కార్యక్రమంలో శ్రియ ఇలా కన్పించి, అందర్నీ కట్టిపడేసింది. వయసు మీద పడ్డా వన్నె తగ్గని అందం అని బహుశా ఇలాంటి అందాన్నే అనాలేమో. సీనియర్‌ హీరోల పక్కనా, యంగ్‌ హీరోల పక్కనా పెర్‌ఫెక్ట్‌గా సూటయ్యే గ్లామర్‌. ఇంకో పదేళ్ళు ఇదే గ్లామర్‌ని శ్రియ కొనసాగిస్తుందనడం నిస్సందేహమేనేమో!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS