బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన చిత్రం `అంధాధూన్`. ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఈ సినిమాకి అంతా సెట్ అయ్యింది. అయితే.. కీలక మైన పాత్రలో ఓ సీనియర్ కథానాయికని ఎంచుకోవాల్సివుంది. అందుకోసం చిత్రబృందం చాలా అన్వేషించింది. `అంధాధూన్`లో ఈ పాత్రని టబు చేసింది. సినిమా మొత్తానికి ఈ పాత్రే హైలెట్. నెగిటీవ్ షేడ్స్ ఉండే ఈ పాత్రని ఓ స్థాయి ఉన్న కథానాయిక చేస్తేనే బాగుంటుంది. అందుకోసం.. చిత్రబృందం చాలా రకాలుగా గాలించింది. చివరికి టబుతోనే ఈ పాత్రని మళ్లీ చేయిద్దామనుకుంది. కానీ.. టబు ఒప్పుకోలేదు. నయనతార ని సంప్రదిస్తే ఆమె ఏకంగా 10 కోట్ల పారితోషికం అడిగి చిత్రబృందాన్ని భయపెట్టింది.
ఇప్పుడు ఈ కష్టాలన్నీ తీరిపోయాయి. టబుకి రిప్లేస్‌మెంట్ దొరికేసింది. ఈ పాత్రలో శ్రియని ఎంచుకున్నారు. ఇందుకోసం శ్రియకు ఏకంగా కోటి రూపాయల పారితోషికం ఇవ్వడానికి చిత్రబృందం రెడీ అయ్యిందట. నిజానికి శ్రియకి ఇంత డిమాండ్ లేదు. కాకపోతే... `అంధాధూన్` రీమేక్‌కి మిగిలిన ఏ కథానాయికా ముందుకు రాకపోవడంతో శ్రియకు ఇంత మొత్తం ఆఫర్ చేయక తప్పలేదు. మొత్తానికి శ్రియ ఎంట్రీతో నితిన్ కష్టాలు తీరిపోయినట్టే. ఇక ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడమే తరువాయి.