సమంత దారిలోనే శ్రియ.!

By iQlikMovies - June 14, 2018 - 14:33 PM IST

మరిన్ని వార్తలు

నందమూరి నటసింహం బాలయ్య బాబు తన సినిమాల్లో హీరోయిన్స్‌ని ఎక్కువగా రిపీట్‌ చేస్తుంటాడు. ఆ కోవలో ఆయన వందో చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాలో ముద్దుగుమ్మ శ్రియని హీరోయిన్‌గా తీసుకున్నాడు. ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. అదే సెంటిమెంట్‌తో 101వ చిత్రమైన 'పైసా వసూల్‌'లో కూడా శ్రియనే హీరోయిన్‌గా ఎంచుకున్నాడు. అయితే అనూహ్యంగా ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. 

ఇకపోతే బాలయ్య ఇప్పుడు రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ కాగా, మరోటి వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రియనే కావాలంటున్నాడట బాలయ్య. గతంలో వినాయక్‌ - బాలయ్య కాంబినేషన్‌లో తెరకెక్కిన 'చెన్నకేశవరెడ్డి' సినిమాలోనూ శ్రియ నటించింది. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇంత లాంగ్‌ గ్యాప్‌ తర్వాత మళ్లీ ఈ ముగ్గురి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందంటే, ఆ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. 

పెళ్లి తర్వాత శ్రియ నటిస్తున్న సినిమా ఇది. మరోవైపు వెంకీతో 'ఆటా నాదే వేటా నాదే' సినిమాలోనూ శ్రియ నటిస్తోంది. తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మధ్య పెళ్లి తర్వాత కూడా హీరోయిన్స్‌కి క్రేజ్‌ తగ్గడం లేదు. సమంత పెళ్లి తర్వాత 'రంగస్థలం' సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టింది. అలాగే శ్రియ కూడా పెళ్లి తర్వాత నటిస్తున్న ఈ రెండు సినిమాలతోనూ బ్లాక్‌ బస్టర్స్‌ అందుకుంటుందేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS