రాజమౌళి మల్టీస్టారర్ RRR లో మరో హీరోయిన్‌కి ఛాన్స్ దొరికింది. ఇప్పటికే ఈ సినిమాలో అలియాభట్ ఓ కథానాయికగా ఎంపికైంది. అలిసన్ డూడీ అనే హాలీవుడ్ భామని ఈ చిత్రం కోసం ఎంపిక చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రత్యేక గీతంలో నర్తించబోతోందని సమాచారం. ఇప్పుడు మరో కథానాయికని కూడా ఎంచుకున్నారు. తనే శ్రియ.
RRR లో శ్రియ ఓ కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఈ విషయాన్ని శ్రియ సైతం ధృవీకరించింది. తనది చాలా ఎమోషనల్ పాత్ర అని, ఫ్లాష్ బ్యాక్‌లో కనిపిస్తానని, అజయ్ దేవగణ్‌తో కలిసి నటించబోతున్నానని పేర్కొంది. లాక్‌డౌన్ ఎత్తేశాక, అంతర్జాతీయ విమానాలకు సైతం అనుమతులు ఇచ్చాక.. తాను షూటింగులో పాలు పంచుకుంటానని చెప్పింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యే వరకూ RRR షూటింగుకు శ్రియ రాలేదు. ఎందుకంటే ఇప్పుడు తన భర్తతో పాటు విదేశాల్లో ఉంటోంది శ్రియ. RRR తో పాటుగా ఓ తెలుగు చిత్రాన్ని, మరో రెండు తమిళ చిత్రాల్నీ అంగీకరించింది ఈ ఢిల్లీ డాల్.