ముద్దుగుమ్మ శృతిహాసన్‌కి 'గబ్బర్ సింగ్' సినిమాతో దశ తిరిగింది. నెంబర్ వన్ హీరోయిన్ ఛైర్‌ని అధిష్టించే స్థాయికి ఎదిగింది. వరుస విజయాలతో దూసుకెళ్లిపోయింది. ఈ వుడ్ ఆ వుడ్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా సత్తా చాటింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. అయితే ప్రస్తుతం శృతిని గడ్డుకాలం వెంటాడుతోంది. భారీ బడ్జెట్ మూవీ అయిన 'సంఘమిత్ర' చేయి జారిపోయింది. ఈ ప్రాజెక్టుపై శృతి భారీగానే ఆశలు పెట్టుకుంది. రీజన్ ఏదైనా కానీ శృతి ఈ సినిమా నుండి తప్పుకోవడం దురదృష్టమే. ఆ తర్వాత ఆమెని ఏ ప్రాజెక్టు దరి చేరడం లేదు. ఆమె ఇటీవల నటించిన 'కాటమరాయుడు' సినిమా కూడా ఫెయిల్ కావడంతో శృతి చాలా అప్సెట్ అవుతోందట. అంతే కాదు ప్రస్తుతం ఆమె ఫిట్నెస్ విషయంలో కూడా చాలా గాసిప్స్ వినిపిస్తున్నాయి. దాంతో దొరికిన ఈ ఫ్రీ టైంను యుటిలైజ్ చేసుకోవాలనుకుంటోందట ముద్దుగుమ్మ శృతిహాసన్. అందుకని జిమ్‌లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ, తన అందమైన శరీరాకృతిని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోందంటున్నారు ఆమె సన్నిహితులు. పూర్తిగా మేకోవర్ అయినాక మళ్లీ అవకాశాల కోసం ట్రై చేస్తానంటోంది. శృతి మల్టీ టాలెంటెడ్. ఆమెకి ఖాళీ టైం దొరికితే అస్సలు ఖాళీగా ఉండదు. రచనలు, మ్యూజిక్, ఇలా బోలెడన్ని టాలెంట్స్ ఉన్న శృతి ఏదో ఒకదానిపై కాన్సన్ట్రేషన్ చేసి టెన్షన్ ఫ్రీ అయిపోతుందట. ప్రస్తుతం అదే పనిలో ఉందట ముద్దుగుమ్మ శృతిహాసన్.