మాస్‌రాజాతో 'స్పెషల్‌' అంటోన్న శృతిహాసన్‌.

మరిన్ని వార్తలు

వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో మాస్‌ రాజా రవితేజ నటిస్తున్న చిత్రం 'డిస్కో రాజా'. ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ కోసం శృతిహాసన్‌ పేరు తెరపైకి వచ్చింది. గతంలో ఈ సినిమాలో శృతిహాసనే హీరోయిన్‌గా నటిస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ, అది నిజం కాలేదు. ఈ మధ్యనే శృతిహాసన్‌ లాంగ్‌ గ్యాప్‌ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ రీ ఎంట్రీ ఇచ్చింది.

 

తమిళంలో విజయ్‌ సేతుపతితో 'లాభం' సినిమాలో నటిస్తోంది. తెలుగులో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకున్న శృతిహాసన్‌, మళ్లీ ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేసే ఛాన్స్‌ వస్తే ఖచ్చితంగా వదులుకోనని చెబుతోంది. అయితే, ఆ ఛాన్స్‌ శృతికి మళ్లీ ఉందా? అంటే ఉందనే చెప్పాలి. టాలీవుడ్‌కి ఎప్పటి నుండో హీరోయిన్ల కొరత అలాగే ఉండిపోయింది. కొత్త భామలు మెరుపుతీగల్లా వచ్చి పోతున్నారే తప్ప, స్టార్‌డమ్‌ కోసం పోటీ పడలేకపోతున్నారు. దాంతో కాజల్‌, సమంత, తమన్నా తదితర సీనియర్‌ భామలకు ఇంకా చేతినిండా పని దొరుకుతూనే ఉంది. అయితే, శృతిహాసన్‌ కూడా ఆ కోవలో చేర్చదగ్గదే. కానీ, రీజన్‌ ఏదైనా సినిమాలకు స్మాల్‌ బ్రేక్‌ ఇవ్వడంతో ఆ లోటు పూడ్చలేనిదైంది. ఏమైతేనేం మళ్లీ ఇన్నాళ్ల తర్వాత శృతి, గతి మార్చుకుని సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది.

 

ఆ దిశగా శృతిహాసన్‌ కోసం ఆల్రెడీ కొన్ని ప్రాజెక్టులు కూడా లైన్‌లోకి వస్తున్నాయి. ఆ క్రమంలోనే 'డిస్కోరాజా' స్పెషల్‌ సాంగ్‌ తెరపైకి వచ్చింది. అయితే, ఈ సినిమాలో శృతిహాసన్‌ స్పెషల్‌ సాంగ్‌తో పాటు, కొన్ని కీలకమైన సన్నివేశాల్లోనూ కనిపించనుందట. సినిమాకి ఆ సీన్స్‌ చాలా ప్రాధాన్యమైనవని తెలుస్తోంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాని డిశంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS