న్యూ లుక్స్‌లో శృతిహాసన్‌!

మరిన్ని వార్తలు

అందానికీ, స్టైల్‌కీ కేరాఫ్‌ ఆడ్రస్‌ శృతిహాసన్‌. 'గబ్బర్‌సింగ్‌' సినిమా శృతి కెరీర్‌ని టర్న్‌ చేసింది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్‌ హీరోయిన్‌ ఛైర్‌ని అధిరోహించింది. అయితే, కొంతకాలంగా శృతి కెరీర్‌ మళ్లీ డౌన్‌ ఫాల్‌ అయ్యింది. దాదాపు రెండేళ్లుగా శృతిహాసన్‌ ఎక్కడా సినిమాల్లో కనిపించడం లేదు. బోయ్‌ఫ్రెండ్‌తో లవ్వూ, పెళ్లీ అంటూ హడావిడి చేసింది. సింపుల్‌గా ఆ లవ్‌కి బ్రేకప్‌ చెప్పేసిందిప్పుడు. ఇక ఇప్పుడు శృతి దృష్టంతా సినిమాలపైనే అని చెప్పడానికి ఆమె లేటెస్ట్‌గా దిగిన ఫోటో షూట్‌ ఎగ్జాంపుల్స్‌గా చెప్పొచ్చు.

 

రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉండడంతో కాస్త బొద్దుగా మారిన శృతిహాసన్‌, ఇప్పుడు మళ్లీ వర్కవుట్స్‌ చేసి స్లిమ్‌గా మారిపోయింది. స్లిమ్‌ అంటే, యాబ్స్‌ ఫిజిక్‌తో సరికొత్తగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే తమిళంలో 'లాభం' సినిమాలో శృతి నటిస్తోంది. విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కాగా, మరికొన్ని కొత్త ప్రాజెక్టులు ఓకే చేసే దిశగా శృతి అడుగులు కదుపుతోందట. ఇక తెలుగు విషయానికి వస్తే, తెలుగులో ఎప్పుడూ హీరోయిన్స్‌ కొరతే.

 

ఆ కొరతే, శృతిలాంటి సీనియర్‌ హీరోయిన్స్‌కి బౌన్స్‌ బ్యాక్‌ అయ్యే ఛాన్సెస్‌ కల్పిస్తుంటుంది అప్పుడప్పుడూ. అన్నీ కుదిరితే, శృతి హాసన్‌ తెలుగులోనూ త్వరలో విజృంభించనుంది. ఆల్రెడీ కొన్ని ప్రాజెక్టులు శృతి కోసం ఎదురు చూస్తున్నాయట. రవితేజ సినిమాలో శృతిహాసన్‌ అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే, అతి త్వరలోనే శృతిహాసన్‌ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమనిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS