ఆటిట్యూడ్ అంటే ఇదీ.. అంటూ డిఫరెంట్ ఆటిట్యూడ్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేసిన హీరో విజయ్‌దేవరకొండ. ఆ ఆటిట్యూడ్‌తోనే యూత్‌లో పిచ్చ క్రేజ్ సంపాదించాడు. చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరో ఇమేజ్‌ని దక్కించుకున్నాడు. ఇప్పుడు కాస్త ఇంచుమించుగా అదే ఆటిట్యూడ్‌తో కనిపిస్తున్నాడు మరో హీరో విశ్వక్సేన్. ఈయన హీరో మాత్రమే కాదు, దర్శకుడు, నిర్మాత కూడా. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఫలక్‌నుమాదాస్' సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
సేమ్ టు సేమ్ విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్‌తోనే సినిమాకి ప్రమోషన్స్ చేస్తున్నాడు. అయితే, విజయ్ దేవరకొండకు వర్కవుటయ్యింది కానీ, విశ్వక్సేన్‌కి బెడిసికొట్టింది ఈ ఆటిట్యూడ్. కాస్త ఓవర్ అయిన ఈ ఆటిట్యూడ్‌తో స్వయానా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నుండే వింత అనుభవాలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆదిలోనే ఈ కుర్రహీరోకి. అయితే, వెంటనే జాగ్రత్త పడిన మనోడు నేను ఎవ్వర్నీ ఏమీ అనలేదు మొర్రో, నా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వేరెవరినో తక్కువ చేసి మాట్లాడాలన్న ఉద్దేశ్యం నాకు లేదు బాబోయ్.. అంటూ సారీ కూడా చెప్పేశాడు. అయినా ఈ వివాదం ఇంతటితో ఆగేలా లేదు మరి. అయితే, ఇక్కడా ఓ విషయం గమనించాలండోయ్. నిజంగానే వివాదం తలెత్తిందా.? లేక ఫలక్‌నుమాదాస్ కొత్త స్ట్రేటజీనా.? ఇది అనే అనుమానం కూడా కలుగుతోంది.
ఎందుకంటే, సినిమాపై కొంత నెగిటివిటీ ప్రచారం చేస్తే, ఆ నెగిటివిటీనే పబ్లిసిటీకి పోజిటివ్ వైబ్స్ తెచ్చిపెడుతుందనేది నేటి నయా ట్రెండ్ కదా. ఏదేమైతేనేం ఈ సినిమాకి ఓ పక్క నెగిటివ్ పబ్లిసిటీ ఇలా నడుస్తున్నా, మరో వైపు టాక్ బాగానే వస్తుండడం, సుకుమార్ వంటి ప్రముఖుల ప్రశంసలు అందుకోవడంతో, ధియేటర్స్‌లో ప్రజెంట్ బాగానే రన్ అవుతోంది. ఈ రన్నింగ్ వారమంతా ఉంటుందా.? లేక ఒకటి, రెండు రోజులకే పరిమితమవుతుందా.? అనేది చూడాలిక.