గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రాల్లో జోడీ కట్టి అలరించారు పవన్ కల్యాణ్ - శ్రుతిహాసన్. వీరిద్దరూ ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టబోతున్నారని, `వకీల్ సాబ్`లో మరోసారి జంటగా కనిపించనున్నారని వార్తలొచ్చాయి. శ్రుతి రాక కన్‌ఫామ్ అయిపోయిందని చెప్పుకున్నారు. అయితే ఈ విషయాలపై ఇప్పుడు శ్రుతి స్పందించింది. తాను వకీల్ సాబ్ లో నటించడం లేదని, అసలు ఆ ఆఫర్ తన వరకూ రాలేదని చెప్పేసింది. సో.. శ్రుతి వకీల్ సాబ్ లో కనిపించడం లేదన్నమాట.
మరి ఆ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారో..? దిల్ రాజు మాత్రం ఓ పెద్ద హీరోయిన్‌ని ఖాయం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తోంది. కాజల్, అనుష్క, తమన్నా... ఇలా చాలా మంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. లాక్ డౌన్ ఎత్తేశాక, షూటింగులు మొదలైతే గానీ, ఆ కథానాయిక విషయం ఓ కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం రవితేజ తో `క్రాక్ `అనే సినిమాలో నటిస్తోంది శ్రుతి. ఈ సినిమాలో మరింతగ్లామర్ గా కనిపించబోతోందట. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది.