దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకులలో రాజమౌళి పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాకి గానూ రాజమౌళి అందుకునే పారితోషికం 50 కోట్లకు పైమాటే అని టాలీవుడ్ టాక్. వందల కోట్ల బడ్జెట్ తో సినిమా తీయడం రాజమౌళి ప్రత్యేకత. ఆర్.ఆర్.ఆర్ బడ్జెట్ పరంగా అత్యంత ఖరీదైన తెలుగు చిత్రం. ఇవన్నీ రాజమౌళి విశిష్టతలు. అలాంటి రాజమౌళి.. కరోనాపై పోరాటం నేపథ్యంలో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా? రూ.5 లక్షలు. డి.వివి దానయ్య, రాజమౌళి కలిసి 10 లక్షల విరాళం ప్రకటించారు. రాజమౌళి వాటా రూ.5 లక్షలు.
అయితే ఆ అయిదు లక్షలు కూడా రాజమౌళి ఇచ్చి ఉండడని, దానయ్యే రాజమౌళి తరపున మరో 5 లక్షలు ఇచ్చి ఉంటాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. పోనీ.. రాజమౌళి 5 లక్షలు ఇచ్చాడనుకుంటే, మరీ అంత తక్కువ మొత్తం విరాళం ఇవ్వడమేమిటి? చిన్న చిన్న నటీనటులు, హీరోలు... లక్షలు లక్షలు ఇస్తున్నారే. అసలు సినిమాలు చేయని వాళ్లు కూడా ఏదో విధంగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారే. రాజమౌళికి ఏం తక్కువ. ఆయన ఎందులో తక్కువ. పాన్ ఇండియా దర్శకుడు అనిపించుకుంటున్న రాజమౌళి మనసు మరీ ఇంత చిన్నదా?