శృతిహాసన్ మళ్ళీ ఫెయిల్

మరిన్ని వార్తలు

కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన శృతి హాసన్ అన్ని విషయాల్లోనూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకొంటోంది. కెరియర్ మొదట్లో ఐరెన్ లెగ్ గా ముద్ర పడిన శృతి తరవాత కాలంలో గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. కేవలం సినిమా కెరియర్ లోనే కాకుండా వ్యక్తిగత విషయాల్లోనూ కమల్ ని మించిపోయింది.  రీసెంట్ గా ప్రభాస్ నటించిన సలార్ మూవీలో మెయిన్ హీరోయిన్ గా నటించింది. సలార్ 2 లో కూడా శృతి హాసన్ మెయిన్ హీరోయిన్. ఈ మధ్య లోకేష్ కనక రాజ్ తో ఒక వీడియో సాంగ్ చేసి అలరించింది. వీటన్నిటి కంటే శృతికి ఎక్కువ పబ్లిసిటీ  తెచ్చినవి రిలేషన్ షిప్స్, బ్రేకప్స్ అని చెప్పొచ్చు. మొదట సిద్దార్థ్ తో ప్రేమవ్యవహారం నడిపింది కానీ అది కలిసి రాలేదు. తరవాత  మైఖేల్ కోర్స‌లే  అనే ఆస్ట్రేలియన్ తో మళ్ళీ ప్రేమలో మునిగి తేలింది. ఆ బంధం భీటలు వారటంతో కొన్నాళ్ళు పాటు డిప్రెష‌న్ కి లోనయ్యింది. ముచ్చటగా మూడో సారి కూడా శృతి ప్రేమ విఫల మైనట్లు సమాచారం. 


మైఖేల్ తరవాత డూడుల్ ఆర్టిస్టు శంత‌ను హ‌జారికాతో శృతి లివిన్ రిలేషన్ షిప్ లో ఉంది. దాదాపు ఐదు ఏళ్లపాటు వీరిద్దరూ రిలేషన్ కొనసాగించారు. వీరి బంధాన్ని ఏనాడు దాచలేదు. శృతి, కమల్ హాసన్ లానే వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచదు. తన లైఫ్ ఓపెన్ బుక్ అన్నట్టు ఉంటుంది.  శంతనుతో శృతి ఏడడుగులు వేస్తుంది అనుకుంటున్న తరుణంలో వీరి బ్రేకప్ విషయం తెరపైకి వచ్చింది. లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం రిలేషన్ లో ఉన్న ఇద్దరు సోషల్ మీడియాలో ఒకర్ని ఒకరు అన్ ఫాలో చేస్తే బ్రేకప్ హింట్ గా పరిగణిస్తున్నారు. చాలామంది సెలబ్రిటీస్ ఇలానే హింట్ ఇచ్చి, తరవాత ఓపెన్ అయ్యారు. ఇపుడు శృతి కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో యాక్టీవ్ గా లేదు. తరచుగా ప్రియుడితో ఉన్న ఫొటోస్ పోస్ట్ చేసే శృతి  ఇద్దరికి సంబంధించి ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. వీరు విడి విడిగా ఉంటున్నట్టు బాలీవుడ్ మీడియా చెప్తోంది. అంతే కాదు వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది.  


కొంత గ్యాప్ తరవాత శృతి ఇనిస్టా లో చేసిన పోస్ట్ కూడా ఆలోచించదగ్గట్లు ఉంది. `ఇది నా గురించి... వ్యక్తుల గురించి చాలా నేర్చుకున్నాను... ఇది ఒక క్రేజీ రైడ్` అని పోస్ట్ చేసింది. దీనితో పలువురు నెటిజన్స్ , శృతి ఫాన్స్ మళ్ళీ శృతికి హార్ట్ బ్రేక్ తప్పులేదా అని వాపోతున్నారు. మరికొందరు కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికాడేమో అని కామెంట్స్ చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS