మెగా ఫ్యామిలీలో హీరోలెక్కువ. ఒకరితో నటించిన హీరోయిన్ మరొకరితో చిందులు వేయడం చాలా కామన్. రామ్ చరణ్ పక్కన స్టెప్పులేసిన కాజల్.. ఆ తరవాత చిరుకి జోడీగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ కల్యాణ్ హీరోయిన్ - చిరు తో డ్యూయెట్లు పాడడానికి సిద్ధపడుతోందని టాక్. తనెవరో కాదు.. శ్రుతిహాసన్. పవన్ కల్యాణ్ తో ముచ్చటగా మూడు సినిమాలు చేసిన కథానాయిక శ్రుతి. ఇప్పుడు చిరుతో బోణీ కొట్టబోతోందని టాక్.
చిరంజీవి - బాబీ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. దీనికి `వాల్తేరు శీను` అనే పేరు పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా శ్రుతిహాసన్ పేరు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాలోనూ శ్రుతినే కథానాయిక. అంటే ఓ వైపు బాలయ్యతోనూ, మరోవైపు చిరుతోనూ ఆడిపాడబోతోందన్నమాట. చిరుతో సినిమా గనుక ఓకే అయితే... శ్రుతి కెరీర్ టాలీవుడ్ లో జోరందుకున్నట్టే.