`డాన్ శీను`తో దర్శకుడిగా తన కెరీర్ మొదలెట్టాడు గోపీచంద్ మలినేని. ఆ సినిమా బాగానే ఆడింది. ఆ తరవాత `బలుపు` మరో హిట్. అక్కడ్నుంచి అన్నీ ఫ్లాపులే. `క్రాక్`తో మళ్లీ నిలబడ్డాడు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నాడు. దీన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కథానాయికగా శ్రుతి హాసన్ ఫిక్సయ్యింది. గోపీచంద్ మలినేనికి శ్రుతిపై గురి ఎక్కువ. `బలుపు`, `క్రాక్`లలో తనే హీరోయిన్. రెండు సినిమాలూ హిట్టే. ఆ సెంటిమెంట్ తోనే... శ్రుతిహాసన్ ని మళ్లీ సీన్‌లోకి తీసుకొచ్చాడు. శ్రుతికి కూడా గోపీచంద్ పై నమ్మకం ఎక్కువ. ఈసారి కథ వినకుండానే... సినిమాని ఓకే చేసేసిందట.
శ్రుతికి కూడా `క్రాక్`తోనే మంచి బ్రేక్ వచ్చింది. `వకీల్ సాబ్`లోనూ తనే కథానాయిక అయినా... ఆ సినిమా విజయంలో శ్రుతి వాటా అంతంత మాత్రమే. పైగా తన పాత్రకు ఏమాత్రం వాల్యూ లేదని, తనని మరీ డీ గ్లామర్ గా చూపించారని విమర్శలు వచ్చాయి. అందుకే `క్రాక్` హిట్ నే... తన హిట్ గా తీసుకోగలిగింది. ఇలాంటి సందరక్భంలో గోపీచంద్ మరోసారి ఆఫర్ ఇచ్చేసరికి.. కాదనలేకపోయింది. పైగా ఇది బాలయ్య సినిమా. అందుకే శ్రుతి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. `అఖండ` షూటింగ్ పూర్తయిపోయింది కాబట్టి.. గోపీచంద్ సినిమాని వీలైనంత వెంటనే పట్టాలెక్కించే ఛాన్స్ వుంది.