నిన్నా మొన్నటి వరకూ శ్రుతి హాసన్ ఓ అవుడ్డేటెడ్ హీరోయిన్. పెద్ద హీరోల సినిమాలకు శ్రుతి పేరుని ఏమాత్రం పరిగణలోనికి తీసుకునేవారు కాదు. ఇక కుర్ర హీరోల పక్కన మరీ అక్కలా ఉంటుందని భయం. అందుకే తెలుగులో శ్రుతిని ఛాన్సులు లేకుండా పోయాయి. `క్రాక్`తో తన దశ తిరిగింది. ఆసినిమా సూపర్ హిట్ అయ్యింది. `వకీల్ సాబ్`లోనూ తను కనిపించేసరికి.. ఒక్కసారిగా లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు... బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమాలో తనే హీరోయిన్. మరోవైపు చిరంజీవితోనూ జోడీ కట్టే అవకాశం దక్కించుకుందని టాక్.
చిరంజీవి - బాబి కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. `వాల్తేరు వీరయ్య` అనే పేరు పరిశీలిస్తున్నారు. ఈచిత్రంలో శ్రుతిని కథానాయికగా ఎంచుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఓవైపు బాలయ్య, మరోవైపు చిరంజీవి... అంటే మాటలు కాదు. ఈసినిమాతో తను మరోసారి బిగ్ లీగ్ లోకి చేరిపోయినట్టే. వరుసగా రెండు పెద్ద సినిమాల ఆఫర్లు, అందులోనూ అగ్ర కథానాయకుల సినిమాల్లో నటించడం శ్రుతికి లక్కీ ఛాన్స్. తనకు మంచి రోజులు మొదలైపోయినట్టే.