కమల్ హాసన్ కుమార్తెగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి కొద్దిరోజుల్లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపుతెచ్చుకుంది శ్రుతిహాసన్. అయితే ఇప్పుడు సినిమాలు తగ్గాయి. కానీ సినియర్ హీరోలకు ఆమెనె ఫస్ట్ ఆప్షన్. సంక్రాంతి కి వచ్చిన వీరసింహ రెడ్డి, వాల్తేరు వీరయ్య లో హీరోయిన్ గా సందడి చేసింది. ఇదీలావుంటే శాంతను హజారిక తో పీకల్లోతు ప్రేమలో వుంది శ్రుతి.
తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఒక పోస్ట్ ని షేర్ చేసింది. ‘యూ ఆర్ ది బెస్ట్. నా హృదయం నీతోనే ఉంది. నా ప్రతి ఆలోచనలోనూ నువ్వే ఉన్నావు. నాకు వెలుగందించిన సూర్యుడివి కూడా నువ్వే. ఈ ప్రపంచంలో అదృష్టవంతురాలిని నేనే‘ అని రాసుకొచ్చింది. ఇందుకు ఆమె ప్రియుడు శాంతను బదులుగా ట్వీట్ చేస్తూ ‘ నా ప్రేయసి నువ్వే. నా ప్రపంచం నువ్వే. నా సూర్యుడు నువ్వే. నా కడలి నువ్వే. యూ ఆర్ బెస్ట్ గర్ల్ ‘ అని రాసుకొచ్చారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.