స్టార్ డాటర్ గా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. కానీ తక్కువ టైంలోనే తండ్రిని మించిన తనయ అనిపించుకుంది. కేవలం నటనలోనే కాదు కాంట్రవర్శిల్లోనూ, బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వటంలోనూ, ఓపెన్ గా ఉండటం లోను శృతి కమల్ ని మించి పోయింది. శృతి జీవితం లో ఎన్నో మలుపులు ఒక సినిమాకి కావల్సిన అంశాలు అన్నీ శృతి జీవితంలో ఉన్నాయి. శృతి బయోపిక్ తీస్తే సూపర్ హిట్ గ్యారంటీ అని కొందరి సూచన.
శృతి ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించి మెప్పించింది. ఇప్పడు హాలీవుడ్ లో కూడా కొత్త జర్నీ మొదలు పెట్టింది. శృతి హాసన్ హాలీవుడ్ లో 'ది ఐ' అనే మూవీతో ఎంట్రీ ఇస్తోంది. శృతి మల్టీ టాలెంటెడ్. కేవలం నటనే కాదు, మ్యుజిషియన్, సింగర్ కూడా. తన హాలీవుడ్ ప్రాజెక్ట్ 'ది ఐ' గురించి శ్రుతి హాసన్ మాట్లాడుతూ 'స్క్రిప్ట్ చదివిన క్షణంలోనే ఈ చిత్రం తన కోసమేనని భావించానని, ప్రేమ, జీవితం, చీకటి, నన్ను మలుచుకునే విధానం అన్నీ ది ఐ మూవీలో ఉన్నాయని తెలిపింది. ఈ కథ వింటుంటే సేమ్ టూ సేమ్ తన కథలాగే అనిపించింది అని శృతి ఆశ్చర్య పోయింది.
'ది ఐ' మూవీలో నటనకి ఎక్కువ ఆస్కారముందని, మహిళా క్రియేటివ్ టీమ్‌తో పనిచేయడం ఈ ప్రాజెక్టు స్పెషల్ అని తెలిపింది శృతి. డయానా పాత్ర తన మనసుకు, తన జీవితానికి చాలా దగ్గరగా ఉందని, ఆ పాత్రలో ఉండే భావోద్వేగాలు స్క్రీన్ పై మరింత అందంగా మలిచారని, కథలో చాలా ట్విస్టులు ఉంటాయని, తన మొదటి హాలీవుడ్ సినిమాపై చాలా హైపు పెంచింది శృతి.