సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ వయసులో కూడా కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. ఏడాదికి కనీసం ఒక సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రీసెంట్ గా జైలర్ సినిమాతో రజనీ లెవెల్ ఏంటో నిరూపించారు. బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. అదే ఊపుతో యాక్షన్ సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తోంది. జైలర్ తర్వాత మరోసారి యాక్షన్ ఎంటర్ టైనర్ కి ఓకే చెప్పారు. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ఈ మూవీ తెరెకెక్కుతోంది. ఈ మూవీ కి కూలి టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లీమ్ప్స్ రిలీజ్ చేయగా సోషల్ మీడియా వేదికగా మంచి స్పందన వచ్చింది.
ఈ మూవీ యాక్షన్ అండ్ డ్రామా నేపథ్యంలో రాబోతోంది. కథ మొత్తం బంగారం స్మగ్లర్ల చుట్టూనే తిరుగుతుందని సమాచారం. లోకేష్ సినిమాలకి అనిరుద్ సంగీతం కూడా తోడయితే ఆ కిక్కే వేరు. వీరి కాంబినేషన్ తిరుగులేదని పించింది. దాంతో ఈ సారి కూడా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. నటీ నటుల డిటైల్స్ ఇంకా బయటికి రాలేదు. కానీ ఒక అప్డేట్ మంచి క్రేజ్ పెంచింది. లోకేష్ మాఫియా సిరీస్ లో శ్రుతిహాసన్ కూడా భాగం కానున్నట్లు తెలుస్తోంది. లోకేష్ , శృతి మంచి దోస్తులు. ఈ మధ్య వీరిద్దరూ కలిసి ఒక ప్రవైట్ సాంగ్ చేసి మంచి జోడి అనిపించుకున్నారు. ఆ స్నేహం తోనే లోకేష్ శృతికి ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నటీ నటుల గూర్చి మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా, శృతి చేసిన తప్పిదం వలన ఈ విషయం బయటికి వచ్చేసింది. సోషల్ మీడియాలో శ్రుతి హాసన్ "డే వన్ కూలీ" అని పోస్ట్ చేసి. వెంటనే తప్పు తెలుసుకుని డిలీట్ చేసింది. కానీ అప్పటికే చాలామంది ఈ పోస్ట్ చూడటం వలన ఈ విషయం బయటికి వచ్చేసింది. కూలీలో శ్రుతిహాసన్ రజినీకాంత్ కూతురిగా కనిపిస్తుందని కూడా టాక్. అంటే కమల్ రియల్ కూతురు రజనీకి రీల్ కూతురుగా నటిస్తోందని తెలియటంతో ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.