సినిమాల్లో నటించడం తగ్గించేస్తే, పనైపోయిందంటారు. ఫ్లాప్ సినిమా వస్తే తెరమరుగైపోయిందని ప్రచారం చేసేస్తారు. అదే హిట్టు సినిమా వస్తే, రెమ్యునరేషన్ పెంచేసిందంటూ హీరోయిన్ల మీద పుకార్లు షికార్లు చేసేస్తాయ్. ఈ ఆవేదన చాలామంది హీరోయిన్లలో వుంటుంది. శృతిహాసన్ పరిస్థితి కూడా అంతే. ‘సలార్’ సినిమా కోసం శృతిహాసన్ రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోబోతోందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘క్రాక్’తో హిట్టు కొట్టింది. ‘వకీల్ సాబ్’ లైన్‌లోనే వుంది. సో, శృతి విషయంలో రెమ్యునరేషన్ పెరగడం అనేది సాధారణం.
పైగా, ‘సలార్’ పాన్ ఇండియా సినిమా. దాంతో, ఆమెకు రెమ్యునరేషన్ గట్టిగానే వుండొచ్చు. కానీ, ఈ పుకార్లపై శృతిహాసన్ గుస్సా అవుతోంది. తానేమీ రెమ్యునరేషన్ పెంచెయ్యలేదనీ, ఎవర్నీ ఎక్కువగా డిమాండ్ చేయడంలేదనీ, తనకు ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలో దర్శక నిర్మాతలు డిసైడ్ చేస్తారనీ చెబుతోంది శృతిహాసన్. ‘నా వరకూ నేను కథ నచ్చితే, మిగతావాటి గురించి ఆలోచించను. కథ నచ్చకపోతే, మిగతా విషయాల ప్రస్తావన అసలే వుండదు..’ అని శృతి కుండబద్దలుగొట్టేసింది.
హీరోయిన్‌గా ఎన్నో సక్సెస్‌లు చవిచూసిన తనకు, ఎన్నో ఫెయిల్యూర్స్ కూడా తెలుసనీ, ఈ తరహా పుకార్లను కూడా ఎన్నో చూసేశానని ఓ ప్రశ్నకు బదులిచ్చింది శృతిహాసన్. ‘వకీల్ సాబ్’ సినిమా తన కెరీర్‌లో మరో స్పెషల్ ఫిలిం అని శృతిహాసన్ అభిప్రాయపడింది.