ముద్దుగుమ్మ శృతిహాసన్ ఇప్పుడు పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. భారీ అంచనాలతో తెరకెక్కిన శృతిహాసన్ తాజా చిత్రం 'కాటమరాయుడు' ఆశించిన విజయాన్ని అందివ్వకపోవడంతో ఆమె పేరు పెద్దగా వినిపించడం లేదు. అరదుకూ శృతి ఇప్పుడు ఓ ఇంటర్నేషనల్ ప్లాన్ వేసింది. అదేంటంటే ఆమె త్వరలో కేన్స్‌కి ప్రయాణం అవుతోంది. అక్కడ ప్రఖ్యాత చలన చిత్రోత్సవ వేడుకల్లో పాల్గొననుంది. ఇంతవరకూ కేన్స్ వేడుకల్లో సౌత్ నుండి వెళ్లిన ముద్దుగుమ్మలే లేరు. బాలీవుడ్ నుండి పలువురు భామలు అక్కడ సందడి చేశారు. తొలిసారిగా ఆ అవకాశం శృతికి దక్కింది. శృతిహాసన్ తమిళంలో 'సంఘమిత్ర' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అమ్మడు యువరాణి పాత్రలో కనిపించనుంది. భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతోంది ఈ చిత్రం. ఈ చిత్రంలో జయం రవి, ఆర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా పబ్లిసిటీ కోసమే శృతి హాసన్ కేన్స్‌కి ప్రయాణమవుతోంది. ఈ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో పబ్లిసిటీ చేయాలన్నదే శృతి ఉద్దేశ్యం. మే 18 నుండి ఈ వేడుకలు కేన్స్‌లో ఘనంగా నిర్వహించబడనున్నాయి. మరో పక్క తండ్రి కమల్ హాసన్‌తో శృతిహాసన్ నటిస్తోన్న 'శభాష్ నాయుడు' చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనే విడుదల కానుంది.