సక్సెస్ వస్తే బాధ్యత పెరుగుద్ది. అదే భరీ స్థాయి సక్సెస్ అయితే ఆ బాధ్యత మరింత పెరిగి, ఆచి తూచి అడుగులేసేలా చేస్తుంది. అదే శృతిహాసన్ కెరీర్లో జరిగింది. పవన్ కళ్యాణ్‌తో నటించిన 'గబ్బర్ సింగ్' సినిమా శృతి కెరీర్‌ని టర్న్ చేసిన సినిమా. ఆ సినిమా తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరిపోయింది. వరుసగా స్టార్ హీరోల ఆఫర్లతో బుల్లెట్ స్పీడుతో దూసుకెళ్లింది. శృతిహాసన్‌కి 'శ్రీమంతుడు' ఇచ్చిన సక్సెస్ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత కోలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ కూడా బాగా బిజీ అయిపోయింది. గతేడాది ఈ ముద్దుగుమ్మ 'ప్రేమమ్'లో నటించింది. 'ప్రేమమ్' కూడా శృతి కెరీర్లో బెస్ట్ మూవీగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగులో 'కాటమరాయుడు' తప్ప పెద్దగా సినిమాలు లేవు. అయితే శృతిహాసన్‌కి స్టార్డమ్ తెచ్చి పెట్టిన హీరో పవన్ కళ్యాణ్. తమిళంలో ఘన విజయం సాధించిన 'వీరమ్'కి రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమాలో శృతిహాసన్ ముగ్గురు తమ్ముళ్లున్న అన్నయ్యకు జోడీగా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు ప్రాధాన్యంతో పాటు, చాలా అందంగా, హుందాగా ఉండనుంది. తమిళంలో 'శభాష్ నాయుడు' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కూడా తెలుగులో విడుదల కానుంది. అయితే ప్రస్తుతం శృతి కాన్సన్ట్రేషన్ అంతా బాలీవుడ్‌పై పెట్టిందని సమాచారమ్. తెలుగులో నటిస్తే వచ్చే గుర్తింపు కొంత వరకే ఉంటుంది. అదే హిందీలో నటిస్తే అలా కాదు ఆ గుర్తింపు ఎక్కువ అని శృతిహాసన్ అభిప్రాయమట.