ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజకు శస్త్ర చికిత్స జరిగింది. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శనివారం ఉదయం ఆయనకు ఆపరేషన్ జరిగింది. శనివారం ఉదయం నుంచి సాయింత్రం వరకూ జరిగిన కాలేయ మార్పిడి ఆపరేషన్ సక్సెస్ అయినట్టు వైద్యులు తెలిపారు.
సుద్దాల తనయుడు అర్జున్ తేజ్ కాలేయ దానం చేశారు. దాంతో సుద్దాల అశోక్ తేజకు జరిగిన ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సుద్దాల, ఆయన తనయుడు ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.