శ్యామ్ సింగ‌రాయ్ టీజ‌ర్ రివ్యూ: నాని న‌యా అవ‌తార్‌

మరిన్ని వార్తలు

నాని ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త క‌థ‌ల‌తో అల‌రిస్తుంటాడు. త‌న సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే న‌మ్మ‌కం క‌లుగుతుంది. అందుకే ప్రామిసింగ్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు త‌న నుంచి మ‌రో కొత్త సినిమా వ‌స్తోంది. అదే.. శ్యామ్ సింగ‌రాయ్‌. రాహుల్ సంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. ఈనెల 24న వ‌స్తోంది. `శ్యామ్ సింగ‌రాయ్‌` టీజ‌ర్ ఈ రోజు విడుద‌లైంది. ఇందులో నాని... నెవ‌ర్ బిఫోర్ అవ‌తార్ లో ద‌ర్శ‌న‌మిస్తున్నాడు.

''అడిగే అండ లేద‌ని
క‌ల‌బ‌డే కండ‌లేద‌ని
ర‌క్షించాల్సిన దేవుడు రాక్ష‌సుడిగా మారుతుంటే..
కాగితం క‌డుపుని చీల్చుకుని పుట్టి
రాయ‌డ‌మే కాదు.. కాల రాయ‌డం కూడా తెలుస‌ని
అక్ష‌రం ప‌ట్టుకున్న ఆయుధం పేరే... శ్యామ్ సింగ‌రాయ్'' 

 


ఈ డైలాగ్ తో టీజ‌ర్ మొద‌ల‌వుతుంది. కొల‌కొత్తా నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. పిరియాడిల్ డ్రామా. చాలా ఏళ్ల క్రింద‌ట కొల‌కొత్తాలో దాసీ వ్య‌వ‌స్థ ఉండేది. దాని కోసం పోరాడే.. ఓ యోధుడిగా నాని క‌నిపించ‌నున్నాడు. అందుకే  ఓ చోట‌ ``స్త్రీ ఎవ‌రికీ దాసీ కాదు.. ఆఖ‌రికి దేవుడికి కూడా`` అనే డైలాగ్ నాని బెంగాలీలో చెప్పాడు. 


సూప‌ర్ హిట్ చిత్రాల సాయి ప‌ల్ల‌వి, తొలి సినిమాతోనే స్టార్ అయిపోయిన కృతి శెట్టి ఈ సినిమాలో క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. నాని ఖాతాలో మ‌రో డీసెంట్ హిట్ ప‌డే అవ‌కాశాలు ఈ సినిమాకున్నాయ‌ని టీజర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ట్రైల‌ర్, సినిమా ఏ రేంజులో ఉంటాయో మ‌రి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS